కాఫీ టేబుల్లోనే ఫ్రిజ్‌

ఇంట్లో కొత్త వస్తువులు

Fridge on the coffee table
Fridge on the coffee table

ఉదయం కాఫీ తాగుతూ పేపర్‌ చదవడం దగ్గర్నుంచి టివి చూడాలన్నా, కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్నా కాఫీ టేబుల్‌ ఎదురుగా ఉన్న సోఫాలో వాలిపోతాం.

అంటే రోజులో ఎక్కువ సమయం గడిపేది కాఫీ టేబుల్‌ దగ్గరే అన్నమాట. అలాంటపుడు మంచినీళ్లు, జ్యూస్‌లాంటివి తాగాలన్నా ఏదైనా తినాలన్నా మాటిమాటితో వంటగదిలోకి ఫ్రిజ్‌ దగ్గరికి వెళ్లే పనిలేకండా కాఫీ టేబుల్‌లోనే ఫ్రిజ్‌ ఉంటే బాగుంటుంది కదూ..

ఈ ఆలోచనతో వచ్చిందే. కూస్నోస్మార్ట్‌ కాఫీ టేబుల్‌..దీనికింది భాగంలో ఉండే ఫ్రిజ్‌ ఉంటే మనం నోటితో ఓపెన్‌ అని చెప్పగానే దానంతటదే ఫొటోలో చూపినట్లూ తెరుచుకుంటుంది.

ఈ రోజుల్లో ఫ్రిజ్‌లో పెట్టుకునేవి బోలెడు ఉంటున్నాయి.

కాబట్టి, ఒక్క ఫ్రిజ్‌ సరిపోవడం లేదనుకునేవారికి ఇది రెండో ఫ్రిజ్‌గానూ పనికొస్తుంది. ఇక, ఈ టేబుల్‌ పైభాగంలో మన ఫోన్‌ పెడితే దానంతటదే ఛార్జ్‌ అయిపోతుంది.

ఇతర గ్యాడ్జెట్లకు ఛార్జింగ్‌కు పెట్టేందుకైతే టేబుల్‌ పక్కగా ప్లగ్‌లుంటాయి. అన్నట్లూ కూస్నో టేబుల్‌ పైవైపునా కిందా రంగురంగుల ఎల్‌ఇడిలుంటాయి.

వీటిని బెడ్‌లైట్‌గానూ ఉపయోగించుకోవచ్చు. మన ఫోన్‌లో వినిపించే మ్యూజిక్‌కి తగ్గట్లు కూడా లైట్లను వెలిగించుకోవచ్చు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/