కాఫీలో పొంచి ఉన్న డేంజర్‌

Offee black
Offee black

కాఫీలో పొంచి ఉన్న డేంజర్‌

మనసుకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగించే వస్తువులకు మనిషి తేలికగా లొంగిపోతాడు. కాఫీకి మానవజాతి దాసోహం అవడానికి కారణం ఇదే. కారణం ఏదైనాగానీ, దక్షిణ భారతదేశం కాఫీ తాగే అలవాటు వలన మనం మదరాసీలుగా ముద్రపడిపోయాం. కాఫీ ఒళ్లునొప్పుల్ని, బద్ధకాన్ని పోగొట్టి, వేడిని తగ్గిస్తుంది. నాడీమండలానికి ఉత్తేజాన్నిస్తుంది.

నిద్ర కల్గి ఉల్లాసంగా ఉంటుంది. బడలికను పోగొడుతుంది. జలుబు, పడిశభారం, దగ్గు, ఆయాసాలకు మంచిది. పాలు కలపకుండా, చిక్కటి డికాషన్‌ని బ్లాక్‌ కాఫీ పేరుతో తాగితే విరేచనాలౌతాయి. కాని అలవాటుపడ్డ వారికి మలబద్ధకం, పైత్యం కడుపులో మంటల్ని తెచ్చిపెడుతుంది. వీర్యనష్టాన్ని చేస్తుంది. శరీరం ఎండుకుపోతుంది. గుండెదడ పెరుగుతుంది. మధుమేహం, కామెర్లు వంటి రోగాలకు కారణమై శరీరం లోపలి సున్నితమైన అవయవాల్ని చెడగొడుతుంది. బెడ్‌ కాఫీగా, ఖాళీ కడుపున కాఫీ తాగితే, జీర్ణాశయానికి సంబంధించిన అవయవాలన్నీ దెబ్బతింటాయి. ఫలహారం తర్వాత కాఫీ కొంత వరకు నయం. పాతబెల్లం కాఫీకి విరుగుడు.