కానుక

DRINKING WATER
DRINKING WATER

కానుక

సంపెంగ పూలని నీడలో ఎండబెట్టి, బాగా చూర్ణం చేసి ఇరవై గ్రాముల చూర్ణాన్ని ఒక స్పూను తేనెలో కలిపి ఒక మోతాదుగా ప్రతిరోజూ రెండు పూటలా తాగుతూ ఉంటే మానసిక వ్యాధి తగ్గుతుంది. మారేడు పండును పూటకు ఒకటి చొప్పున రెండుపూటలా తింటే మానసిక వ్యాధి తీవ్రత తగ్గిపోతుంది.

పసుపు, శొంఠి, యాలకులు, నల్లమిరియాలు కలిపి పొడిచేసి సేవిస్తే జీర్ణశక్తి పెరు గుతుంది. గ్యాస్‌ట్రబుల్‌ తగ్గుతుంది. పేగులలో గాలి, క్రిములు తగు ్గతాయి. కడుపునొప్పి తగ్గుతుంది. గాయాల మీద పసుపు పొడి చల్లితే త్వరగా మానతాయి.

ఫర్నీచర్‌ మీద పడిన మచ్చలు, గీతలను తొలగించాలంటే సిగరెట్‌ బూడిదలో వెనిగర్‌ కలిపి ఆ పేస్టుతో రుద్దాలి. ్య నీటిలో టీ పొడివేసి మరిగించిన చిక్కటి ద్రావణంలో క్లాత్‌ను ముంచి తుడిస్తే ఏ రకమైన ఫర్నీచర్‌ అయినా శుభ్రపడుతుంది.

టేబుల్‌ డ్రాలు కాని వార్డ్‌రోబ్‌ తలుపులు కాని తీసేటప్పుడు, వేసేటప్పుడు పట్టేస్తుంటే చక్రాలకు మైనం కాని సబ్బుకాని రాయాలి. ్య ఆలివ్‌ ఆయిల్‌లో అంతే మోతాదులో వెనిగర్‌ కలిపి తుడిస్తే ఫర్నీచర్‌ కొత్తవారిలో మెరుస్తుంది.

ఫర్నీచర్‌మీద పడిన మరకలను షూ పాలిష్‌తో తుడిస్తే పోతాయి.

కూరలలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వేయించిన వరిపిండిని కలపాలి. లేదా బంగాళాదుంపముక్కలుగా కోసి వేసినా సరే.