కానుక

Cooking111
Cooking1

కానుక

క్రొత్త బియ్యం వండేటప్పుడు కొంచెం పప్పు నూనె వేసి అన్నం వండితే ముద్ద అవ్వదు. పొడిపొడిగా ఉంటుంది.

వంటసామాన్లు నీరుల్లి వాసన వచ్చినప్పుడు వాటిని ఉప్పు కలిపిన వేడినీళ్లతో శుభ్రం చేసిన ఆ వాసన పూర్తిగా పోతుంది.

స్టీలుగాని, ఇత్తడిగాని గ్లాసులో గ్లాసు ఇరుక్కుంటే వాటిని వేడినీళ్లల్లో వేస్తే కొద్దిసేపటికి వేరువేరుగా విడిపోతాయి. అదే గాజువి అయితే గోరువెచ్చని నీళ్లల్లో వేయాలి.

రక్తం మరకలు పోగొట్టటం కోసం వేడినీళ్లు ఎప్పుడూ వాడరాదు. ఉప్పు కలిపిన చల్లని నీళ్లల్లో అరగంట బట్టలు నానబెట్టి, తరువాత డిటర్జెంట్‌ సబ్బుతో మరకల మీద బాగా రుద్దితే పోతాయి.

లేక ఇంకా మరకలు కన్పిస్తుంటే మరకలు పడిన బట్టని, చిన్న గిన్నెమీద ఉంచి మూడు అడుగుల ఎత్తు నుండి వేడినీళ్లు పోస్తే టీ, కాఫీ మరకలు కూడా మాయమవుతాయి.