కానుక

CHITKA
CHITKA

కానుక

పొడిచర్మం కలవారి పాలిట ఆలివ్‌ ఆయిల్‌ ఒకవరమే. దీనితో చర్మం పైన మర్దనా చేయడం ద్వారా, ఆహారంగా లోపలికి తీసుకోవటం ద్వారా పిల్లల చర్మం అందంగా, ఆరోగ్యంగా మదువుగా కాంతివంతంగా మారుతుంది.

చర్మం, జుట్టు, గోళ్లు, చిగుళ్లు వీటిని ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ ఆలివ్‌ ఆయిల్‌ తన ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలకు ఆలివ్‌ ఆయిల్‌తో ప్రతిరోజూ మర్దనా చేయవచ్చు.

ఈ నూనెకు ఉన్న సౌలభ్యం ఏమిటంటే దీనితో స్నానానికి ముందు లేదా తరువాత ఎప్పుడైనా మసాజ్‌ చేయవచ్చు. పాపాయికి స్నానం చేయించే ముందుగానే శరీరానికి సరిపడా ఆయిల్‌తో చక్కగా మసాజ్‌ చేయాలి.తరువాత స్నానం చేయించాలి. లేదా వేడినీళ్లతో స్నానం చేయించి ఆ ఒంటికే ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయటం వలన పిల్లలు ఆదమరిచి చక్కగా నిద్రపోతారు.

ఆలివ్‌ ఆయిల్‌ వారి శరీరాల్లోకి చక్కగా ఇంకుతుంది. ఏ మాత్రం జిడ్డు అనిపించకుండా చర్మం మదువుగా మారుతుంది.