ఒత్తిడే అన్నింటికీ మూలం

stress
stress

ఒత్తిడి వల్ల మొదటి చిన్నచిన్న చికాకులు, ఆవేశం, ఆందోళన, కోపం, అసూయ వంటివి ఏర్పడి క్రమేణా పెద్దపెద్ద వ్యాధులకు ఆజ్యం పోస్తాయి. ఒత్తిడే అన్నింటికి మూలకారణం. తరుచు ఒత్తిడితో బాధపడేవారు ఎప్పుడూ జలుబు, ఆస్మా, కీళ్లనొప్పులు, బాడీపెయిన్స్‌, ఎలర్జీ, డయాబెటీస్‌, గుండెపోటు, పక్షవాతం, న్యూరాలాజికల్‌ సమస్యలు, తలనొప్పులు వంటి దీర్ఘవ్యాధులతో బాధపడతారు.


ఈ ఒత్తిళ్లను తట్టుకొని బతకటానికి మెదడులోని హైపోధాలమస్‌, పిట్యూటరీ గ్రంధి కిడ్నీలపై వ్ఞండీ ఎడ్రినల్‌ గ్రంధి వంటి ఈమూడు గ్రంధులే జీవితానికి ఇరుసులాంటివి. వీటి సమిష్టి సహకార సమన్వయం వల్లనే ఒత్తిడిని కల్గించే సంఘటనలు ఎదుర్కొవడమో, పక్కకు జారుకోవడమో చేయాల్సి వస్తుంది. జీవకార్య సమన్వయలోపమే వ్యాధిగా బహిర్గతమవ్ఞతుంది. మనస్పందన శక్తే వ్యాధి విన్యాసం, వ్యాధి నివారణ అని చెప్పాలి. ఒక ప్రతికూల సంఘటన జరగగానే దాని పరిణామాల్ని ముందే ఊహించుకోవడం వల్ల, భయం వల్ల లేనిపోని ఆందోళనలకి, ఒత్తిడికి లోనవ్ఞతాము.

దీనివల్ల మెదడు, గుండె, లివర్‌, కిడ్నీలకి ఎక్కువ రక్తసరఫరా అయ్యి రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. ఆక్సిజన్‌ అవసరం కావడం వల్ల శ్వాసవేగం పెరుగుతుంది. మెటబాలిజమ్‌లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల విడుదలయ్యే ఇంపల్సస్‌ సింపధిటిక్‌, ఫారాసింపథిటిక్‌ నాడీవ్యవస్థ ద్వారా పిట్యూటరీ వంటి ఎండోక్రైనల్‌ గ్రంధుల్ని ప్రభావితం చేస్తూ శరీరంలోని ప్రతికణాన్ని ప్రభావితం చేయగలవ్ఞ. ఇది ఒత్తిడిని తట్టుకోవడానికి అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేస్తుంది. సింపథిటిక్‌, పారా సింపధిటిక్‌ నాడీ వ్యవస్థల పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా ఒత్తిడి తలెత్తుతుంది.

మనకు వచ్చే ప్రతికూల సంఘటనలు శాశ్వతం కావ్ఞ. కాని దాని ఒత్తిడి వల్ల వచ్చే పరిణామాలు శాశ్వతంగా వ్ఞండిపోయే ప్రమాదముంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా వ్ఞంటుంది. నెగటివ్‌ ఆలోచనలతో కాకుండా మైండ్‌ను పాజిటివ్‌ ఆలోచనలతో ప్రశాంతంగా వర్తమానంలో జీవించ గలగడమే ఒత్తిడి నివారణకు మందు. లేదంటే ఎప్పటికీ నిరాశ, ఆందోళన, టెన్షన్‌, దుఃఖంలోనే మగ్గిపోతుంటాం. నేటి జీవన విధానం అస్తవ్యస్తం గా ఉండి సమతౌల్యం లోపించడం వల్లనే ఒత్తిడి, ఆందోళనలు తలెత్తుత ున్నాయి.

మనలోని కోరికలు, భావోద్వేగాల వల్లనే తలెత్తె ఆందోళనల్ని, ఒత్తిళ్లను జాగరూకతతో, సమభావనతో గమనించి ఆ నెగిటివ్‌ శక్తిని పాజిటివ్‌శక్తిగా మార్చితే తేలికగా ఆ పరిస్థితుల్ని అధిగమించవచ్చు. లేకపోతే వ్యాధి నిరోధకశక్తి తగ్గి అనేక సైకోసోమాటిక్‌ వ్యాధులొస్తాయి.
నివారణ: ఒత్తిడిని కంట్రోల్‌ చేయాలంటే ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలి. తగిన విశ్రాంతి తీసుకోవాలి.