ఒత్తిడిని అధిగమిస్తేనే ఆరోగ్యం

Tension
Jernoliers

ఒత్తిడిని అధిగమిస్తేనే ఆరోగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన పెద్దలు చెప్పినమాట. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకే ఆరోగ్యంగా జీవించే జీవన విధానాన్ని అలవాటు చేశారు మనపెద్దలు. వేకువజామున లేవడం, సూర్యనమస్కారాలు, ప్రవహించే నీటిలో స్నానాలు వేళ ప్రకారం ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు. పూర్వం వైద్యసౌకర్యాలు సరిగా అందుబాటులో ఉండేవి కావ్ఞ. ఆర్థికపరిస్థితులూ అంతంతమాత్రమే. అయినా అధికశాతం ప్రజలు ఆరోగ్యంతో జీవించారు. కాలక్షేపానికి అప్పట్లో ఉన్న అంశాలు తక్కువే. అయినా జీవితం బోర్‌ అనిపించేది కాదు. కాని నేడు అన్ని సౌకర్యాలూ పెరిగాయి. చదువ్ఞలు మారాయి. ఉద్యోగావకాశాలు, ఆదాయం రెండూ పెరిగాయి. కాలక్షేపానికి సినిమా, టీ.వీ,డి.వి.డి, ఇంటర్నెట్‌ ఇలా ఒకటీ, రెండూ కాదు అనేకం వచ్చాయి. కాని జీవితంలో ముఖ్యమైన ఆరోగ్యం తగ్గిపోయింది.

అన్నింటినీ అను భవించడానికి అవసరమైన వనరులు ఉన్నాయి కాని, వాటిని అనుభవించటానికి తగిన ఆరోగ్యం లేదు. ఒత్తిడి జీవితం వద్దు సుఖంగా నిద్రపోలేరు. వేళకు తిండి తినలేరు. తిన్నదానిని ఒంట పట్టించుకోలేరు. పని…పని…పని…కుర్చీలో నుండి కదలాల్సిన పనిలేకుండా పనిచేస్తున్నారు. ఎండతగలని వాతావరణం, సహజమైన గాలి సోకని గదుల్లో జీవితం. వీటన్నింటినీ మించిన ఒత్తిడి. శారీరక, మానసిక ఒత్తిడులు అత్యంత తీవ్రంగా ఉంటున్నాయి. ఫలితంగా మానసికంగా, శారీరకంగా కూడా దెబ్బతింటున్నారు. మూడుపదుల వయసులోనే డయాబెటిస్‌, బి.పి.వస్తున్నాయి. నాలుగు పదుల వయసుకే హృద్రోగులవ్ఞతున్నారు. ఉన్నత చదువ్ఞలు, ఉద్యోగాలు, అపరిమిత ఆదాయం. అయినా అవేవీ ఆరోగ్యాన్ని ఇవ్వడం లేదు. అందుకే సంపదతో ఆరోగ్యం రాదు అన్న సూత్రం అందరూ అంగీకరించాల్సి వస్తున్నది. నేడు ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న ఐ.టి.రంగాన్నే తీసుకోండి. ఇలా బి.టెక్‌ అవగానే అలా ఒక ప్లేస్‌మెంట్‌ దొరికిందనే థ్రిల్‌. ఇరవై ఏళ్లు నిండకుండానే ఇరవైవేల జీతంలో పిల్లలకు ఉద్యోగం దొరికిందని తల్లిదండ్రులు సంతోషపడుతున్నారేగాని పిల్లల భవిష్యత్తును సరిగా ఊహించలేకపోతున్నారు. పనిగంటలమీద పరిమితి లేదు. పనికి రాత్రి, పగలు తేడా లేదు. నిద్రపోవాల్సిన సమయంలో పనిచేస్తూ, పనిచేయాల్సిన సమయంలో నిద్రపట్టక దొర్లుతున్నది నేటి యువత. ఆ నిద్ర,పనికి తగినట్టే ఉంటుంది ఆహారం. వేళకాని వేళలో అందించే ఆహారం ఎలా వినియోగించుకోవాలో తెలియని శరీరం ఆ ఆహారం అందించే శక్తిని వినియోగించక నిలువ చేసుకుంటుంది.

ఫలితంగా శరీరం లావెక్కుతుంది. ఈ భారీకాయానికి కారణం అధికంగా తినడం అనుకుని డైటింగ్‌ మొదలుపెడతారు. దీనివలన లావ్ఞ తగ్గకపోగా ఓపిక తగ్గి ఆస్ప్రత్రి పాలవ్ఞతారు. ఇది చాలామందిలో కనిపించే సమస్య. ఆహారపు అలవాట్లు ముఖ్యం ఆహారపు అలవాట్లను మార్చుకోవడం కన్నా మరో మార్గం లేదు. నాగరికతతో మనం మారిందనుకుంటున్న ఆహారపు అలవాట్లు సరైనవి కావని, సాంప్రదాయ జీవన విధానమే వైజ్ఞానిక విలువలు కలిగినదని పరిశోధకులు ధృవీకరిస్తున్నారు. ఉదయం చద్దిఅన్నం తినడం మన సమాజపు అలవాటు. అది చాలా మంచిది. పరిశోధకులు ప్రకారం ఉదయం తీసుకునే ఆహారం ద్వారా శరీరం అధికంగా విటమిన్లు, లవణా లను, అతి తక్కువగా కొవ్ఞ్వలను గ్రహిస్తుంది. అందుకే అటువంటి ఆహారపు అలవాట్లు కలవారంతా శరీరాలు సన్నగా, బలంగా ఉంటాయి. వారి శరీరంలో కొలెస్టరాల్‌ అధికంగా ఉండదు. పైగా ఉదయమే అన్నం తిన్నవారు మధ్యాహ్నం భోజనాన్ని పరిమితంగా తీసుకుంటారు. ఈకాలంలో ఉదయమే భోజనం అనేదాన్ని ఎవరూ అంగీకరించరేమో, ప్రతిరోజూ అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. ఉదయం ఏమీ తినకుండా మధ్యాహ్న భోజనందాకా కడుపును ఖాళీగా ఉంచకూడదు.

ఉదయం తక్కువ కొవ్ఞ్వలు, సాధా రణస్థాయి ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్‌లు కలిగిన ఆహారం తీసుకోవాలి. రోజులో మూడుసార్లు ఆహారం తినడం మన అలవాటుగా ఉండేది. దానిని ఇప్పుడు అయిదుపూట్లకు పెంచమన్నది సలహా. ”అయిదుసార్లు అన్నమా…బరువ్ఞ పెరగమా అనే సందేహం కలగవచ్చు. కాని ఐదుసార్లు తినేవారు పరిమితంగానే తింటారు. ఆహారపు పరిమాణం పెంచక, మూడుపూట్ల తినేదానినే ఐదుసార్లు తినాలన్నది సూచన. ఒకసారి ఐదుపూటలు తినడం అలవాటు. అయితే క్రమంగా తినే తిండి తగ్గుతుందనేది నిపుణుల మాట. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ని కడుపునిండా తినేవారు మధ్యాహ్న భోజనాన్ని తగ్గించుకోవాలి. ఉదయం, రాత్రివేళ భోజనాలలో ఒకేపదార్థాలు తినవద్దు. ఒకపూట వరి అన్నం తింటే రెండవపూట గోధుమ తినండి. అలా ఏపూట ఏది తినగలగడం అనేది వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఆహారం ఏది తీసుకుంటున్నా అందులో కొవ్ఞ్వలను పరిమితం చేయడం లక్ష్యం. వేపుడుకూరలు వద్దు. ఉడికించిన కూరలు తినాలి. ఆహారంతో పాటుగా పండ్లు తీసుకోవడం పెంచాలి. ఆహారంలో పండ్లను తినడం పెంచాలి.

తాజాకూరగాయలు, తాజాగా చేసిన చట్నీలకు ప్రాధాన్యతనిచ్చి ఊరగాయల వాడకం తగ్గించండి. పెరుగుగా కాక మజ్జిగగా చేసుకుని తినండి. కాఫీ,టీలు తగ్గించండి. స్వీట్స్‌ పరిమితంగా తినడం మంచిది. వేయించిన కూరలు వద్దు. వంటనూనెను మార్చడం మంచిదే. కొలెస్టరాల్‌ తగ్గించే పదార్థాలే తినండి. అనవసరపు మందులు మీకు మీరుగా వేసు కోవద్దు. మాంసాహారపదార్థాలను, ఉప్పు, పంచదారలను తక్కువస్థాయిలో తీసుకోండి. చిన్న పనులు చాలు వ్యాయామం అనగానే అదొక శిక్షలా భావిస్తారు చాలామంది. ఆ భయంతోనే శరీరాన్ని వ్యాయామానికి దూరం చేస్తారు. వ్యాయామ మంటే వస్తాదులు చేసేలా చెయ్యడం కాదు. శరీరమంతా చెమటతో నింపుకోవాల్సిన పనిలేదు. శరీరాన్ని అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన మేర కదలికలు ఉంటే చాలు. ఆహారం తీసుకోవడం దినచర్యలో భాగం అయినట్టే వ్యాయామం కూడా దినచర్యలో భాగమవ్వాలి. అలాగని రోజుకు అయిదుసార్లు జిమ్‌కి వెళ్ళనవసరం లేదు. నిజజీవితంలో అంత తీరిక ఉండదు కూడా. ఇంటిలో చేసే పనులనే వ్యాయామంగా మలచుకోవాలి.

చక్కని ఒంపుసొంపుల శరీరం మీదికన్నా చురుకుగా కదలగల శరీరం గురించి ఆలోచించాలి. అందుకోసం అన్నిభాగాలు అదుపులో ఉండేలా పనులు చెయ్యాలి. జిమ్‌కి వెళితేనే వ్యాయామం సాధ్యమనుకోవద్దు. ఉదయం లేచినప్పటి నుండి ఇంటిలో కిందికి వంగి లేచే పనులు ఏవైనా చెయ్యండి. అల్మారాల్లో అడుగు వరసలో ఉన్న వస్తువ్ఞలను అందుకునే యత్నం చేయండి. ఇంటిలో ఒంటరిగా ఉంటే సంగీతం పెట్టుకుని డ్యాన్స్‌ చేయండి. కాళ్ళు చేతులను వేగంగా కదిలిస్తూ చేసే ఏ పనైనా వ్యాయామమే.