ఏకపాద ఉత్ధానాసనం

YOGA
YOGA

ఏకపాద ఉత్ధానాసనం

ఈ ఆసనం వేయడం వలన కండరాలకు ఉత్తేజం కలగడమే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. వేసే విధానం నేలమీద పడుకుని కాళ్లు జాపి రెండు చేతులను తొడల ప్రక్కగా ఆనించి ఉంచాలి. బాగా శ్వాస తీసుకుంటూ కుడికాలును నిటారుగా పైకి లేపాలి. కాలును ఏమాత్రం వంచకుండా వ్ఞండాలి. ఇదేవిధంగా ఎడమ కాలుతో కూడా చేయాలి. ఈ ఆసనం ఎంతసేపు వేయగలిగితే అంత మంచిది. ఉపయోగాలు ఈ ఆసనం వలన శరీరంలోని కొవ్ఞ్వ కరిగి బాగా సన్నబడతారు. దీనిని ప్రతి రోజు వేసేవారు బరువు పెరగరు.

కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి. వెన్ను కూడా బలపడుతుంది. గ్యాస్‌ట్రబుల్‌ తగ్గుతుంది. ఊపిరితిత్తులు చక్కగా శుభ్రపడతాయి. స్త్రీలకు బహిష్టు సమయంలో వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి. ఇందువలన ఏకాగ్రత పెరుగుతుంది.