ఎనీమియా లక్షణాలు

sad
sad

భారతీయ మహిళలు ఎక్కువశాతం రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు కారణం చిన్నవయసులో పెళ్లి కావడం, పిల్లలకు జన్మనివ్వడం, కుటుంబ బాధ్యతలు పెరగడంతో వారు సరైన పోషకాహారాన్ని తీసుకోవడంలో శ్రద్ధ చూపలేకపోతున్నారు. దీంతో రక్తహీనతతో బాధపడేవారి శాతం క్రమంగా పెరుగుతున్నది. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడాన్ని రక్తహీనత అని అంటాం. సగటున రోజుకి ఒక వ్యక్తికి 2000 మిల్లీగ్రాముల ఇనుము అవసరమవ్ఞతుంది. రక్తహీనతతో బాధపడేవారు ముఖ్యంగా ఇనుము ఎక్కువగా ఉంే ఆహారపదార్థాలను బాగా తీసుకోవాలి. (శాఖాహారులకు/మాంసాహారులకు) మనం రోజూ తీసుకొనే ఆహారంలో బెల్లం, రాగులు, రాగిముద్ద, సజ్జలు, బెల్లంతో తయారు చేసిన వేరుశెనగ ఉండలు, నల్లద్రాక్షపళ్లు, బాదం, సపోటా, యాపిల్‌, మామిడి, సీతాఫలం, బొప్పాయి, పుచ్చకాయ, చెర్రి, స్ట్రాబెఈ, రాస్పబెర్రీ, కిస్మిస్‌, దంపుడు అటుకులు, దంపుడు బియ్యం, నల్లనువ్ఞ్వలు, నువ్ఞ్వలనూనె, బ్రెడ్‌, పాలు, ఒంటెపాలు, తేనె, మొలకెత్తిన పెసలు, శెనగలు, ఆప్రికాట్‌, ఖర్జూరం, ఈతపండ్లు, బీట్‌రూట్‌, బీన్స్‌, రాజ్మామటన్‌, చికెన్‌, నత్తలు, కొన్నిరకాల చేపలు, గోధుమ గడ్డిరసం (వీట్‌గ్రాస్‌), ఉల్లికాడలు, తోటకూర, మునగాకు, తాజా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటితోపాటు ‘సి విటమిన్‌ ఉండే ఉసిరి, బత్తాయి, నిమ్మ, నారింజ తీసుకుంటే శరీరం ఇనుముని బాగా గ్రహిస్తుంది. ఇనుము లోపం కారణంగా వచ్చే రక్తహీనత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారు ఆహారపదార్థాలను ఇనుపపాత్రల్లో వండుకొని తింటే ఒంటికి కొంత ఇనుము పట్టి రక్తహీనత నుండి బయటపడడానికి బాగా దోహదం అవ్ఞతుందని హెమటాలజిస్ట్‌లు, పరిశోధకులు అంటున్నారు.
రక్తహీనత లక్షణాలు: కంటిచుట్టూ నల్లటి వలయాలు, కళ్లు తిరగటం, కళ్లుపాలిపోయినట్లు ఉండటం, చూపు మందగించడం, తలనొప్పి, తల తిరుగుతున్నట్లు ఉండటం, చీటికిమాటికీ జలుబు చేయడం, గుండెదడ, గుండె పెరగడం, గుండెవేగంగా కొట్టుకోవడం, త్వరగా అలసిపోవడం, కొద్దిగా ఇచేసరికి ఆయాసం రావడం, శ్రమపడకుండా అకారణంగా నీరసం రావడం, తీవ్రమైన అలసట, బలహీనత, ఏపని చేయడానికి శరీరం సహకరించకపోవడం, నిరుత్సాహం, సోమరిగా ఉండటం, చెవ్ఞల్లో మోత వినపడటం, ఆకలి లేకపోవడం, నిద్రపట్టకపోవడం, తిన్నది అరగకపోవడం, కాళ్లు చేతులు తిమ్మెర్లు, కాళ్లకు, ఒళ్లంతా నీరు చేరడం చర్మం రంగు తెల్లగా పాలిపోవడం, ముఖం పాలిపోవడం, శరీరంలో విపరీతంగా కొవ్ఞ్వశాతం నీటిశాతం పెరిగిపోవడం, చేతివేళ్లు, నాలుక, పెదాలు పాలిపోయి తెల్లగా కనిపించడం, చిగుళ్లవాపు, నాలుకపై తెల్లని మచ్చలు, తరచూ ఇన్ఫెక్షన్లు మొదలైన లక్షణాలు ఉంటాయి. మన శరీరంలో ఇనుము పాత్ర చాలా కీలకమైనది కాబట్టి ఎనీమియా లక్షణాలు కనబడినప్పుడు వీలైనంత త్వరగా డాక్టరును సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. సాధ్య మైనంతవరకు నిత్యం ఆహారంలో ఉప్పును తగ్గించుకొని తినడం ఎంతో శ్రేయస్కరం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/