ఎదిరించే నిబ్బరం కావాలి

Herrasment
Herrasment

ఎదిరించే నిబ్బరం కావాలి

వారిద్దరికి పెద్దలు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ అబ్బాయి బాధ్యతాయూతంగా ప్రవర్తిస్తుండడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే అబ్బాయి మాత్రం ఆమెను పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టాడు. అందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో అబ్బాయి, ఆమెను కత్తితో పొడిచి చంపేసి, అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక కేసులో ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని, పెట్రోలుపోసి, నిప్పంటించి, చంపాడు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇవాల్టి రోజుల్లో, ప్రొద్దున లేస్తే పేపర్లలోను, టీవీల్లోనూ వార్తలే వార్తలు.

24గంటల ఛానెల్స్‌ పుణ్యమా అని, వార్తలు జెట్‌ స్పీడ్లో మన కళ్లయెదుట ప్రత్యక్షమవ్ఞతున్నా§్‌ు. మనం కూడా అంతే నిర్లిప్తతతో వాటిని చదివో, టీవీ అయితే చూసో, మన పనులు మనం చూసుకుంటున్నాం. అప్పుడెప్పుడో పెద్దవారెవరో అన్నట్లు, నట్టింట్లో కాలిన శవాలను, చితికిన శవాలను చూస్తూ కూడా (టీవీలో) మనకిష్టమైన కోడికూరో, మరో కూరో తినగలిగే స్థితప్రజ్ఞులమైపోయాం. నిజానికి టీవీల్లోగాని, పేపర్లలోగాని విపరీత దృశ్యాలను, ముఖ్యంగా రక్తపాతాలను అసలు చూపకూడదని ఇంటర్నేషనల్‌ లా చెపుతున్నా, మనం వాటిని పట్టించుకోం సరికదా, కనీసం ఆ చనిపోయిన వ్యక్తిపట్ల ఇసుమంత కూడా గౌరవం చూపలేం. ఎందువల్ల అంటే, మనలో స్పందనలు తగ్గిపోయి ఉండాలి. లేక యెవరికో యేదో అయితే మనకేంటి అన్న భావం అయ్యుండచ్చు. అదే ఆపద మనకి కలిగితే మాత్రం ”యెవరూ సరిగా స్పందించలేదుఅని యేడుస్తాం. పేపర్‌ తిప్పితే అత్యాచారాలు, హత్యాచారాలు, డబ్బులకోసం, హత్యలు కాళ్లకడియాలకోసం, పిల్లల చెవిపోగుల కోసం, మెడలో సూత్రాల కోసం,

ఇలా కావేవి హత్యకు అనర్హంలా తయారవ్ఞతుంది. పరిస్థితి. నిర్భయ చనిపోతే ప్రభుత్వ అసమర్థత, అభయ మీద అత్యాచారంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదు, రక్షణకు రక్షణ కరువైంది. ప్రభుత్వ విధానాలు సరిగా లేక…ఇలా ప్రతీదానికి ప్రభుత్వానిదే తప్పు. మరి సమాజం పోషించే పాత్రయేమిటి? కేవలం చూడ్డమేనా? మన చుట్టూ జరుగుతున్న సంగతులను మనం ఎంతవరకు గమనిస్తున్నాం, ఎలా స్పందిస్తున్నాం అన్నది ఒకసారి అవలోకనం చేసుకోవడం అవసరం. ఆటో అంకుల్‌ నాతో అదోలా ఉంటున్నాడు అని స్కూలు పిల్లలు చెపుతుంటే ఎంతమంది ఆలకిస్తున్నారు? ట్రైన్‌లో ఎదురుగా కూర్చున్న ఆడపిల్ల ఒంటరిగా ఎక్కడికి వెళుతుందీ, అని అడిగిందెవరు? చేతల సాయం అటుంచి, కనీసం మాట సాయం చేస్తున్నామా? ప్రక్కింటి వాళ్లతో, బస్సులో రోజూ ఎదురయ్యే తోటిప్రయాణికులతో రైల్లో రాత్రంతా కూడా ప్రయాణించే తోటి ప్రయాణికులతో మాట్లాడి ఎంతకాలమైందో ఒకసారి ఆలోచించండి. అలా మాట్లాడగలిగితే ఎంతోమంది నిర్భయలను, మరెంతో మంది ఎస్తెర్‌ అనూహ్యలను కాపాడి ఉండేవాళ్లం. ఆడపిల్ల ఉద్యోగం నిమిత్తం ఒంటరిగా రైల్లో వెళుతుంటే, కనీసం ఆ అమ్మాయి ఎక్కడికి వెళుతుంది,

ఎలా వెళుతుంది అన్న ఆలోచన కనీసం ఒక్కరికైనా ఉండి ఉంటే, ఎస్తెర్‌ అనూహ్య, అలా అనూహ్యంగా మాయమైపోదు. ఏ క్రూరమృగాళ్ళ బారినపడిందో పాపం ఆ ఆడకూతురు, కన్నవారికి ఆనవాలు కూడా తెలియనంత దారుణంగా చంపబడింది. ఆ ఆఖరునిమిషాల్లో ఎంత వేదన పొందిందో, ఎంతగా ప్రాధేయపడి ఉంటుందో? అయినా మనసు కరగని ఆ క్రూరమృగాళ్ళు ఆమెను అమానుషంగా తగలబెట్టేసారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఎవరో ఒకరు ఆ సంగతి చూసి ఉంటారు కాని,”మనకెందుకులే ఆ గొడవఅని మరింత వేగం పుంజుకుని వెళిపోయి ఉంటారు.

ఒకవేళ ”అదేస్థితిలో, నా కూతురో, నా బంధువో ఉంటేనో అన్న చిన్న ఆలోచన, ఇలాంటి హత్యాచారాలను నివారించగలదు. అలాంటి ఆలోచనని యెందుకు రానీయటం లేదు మనం? ”స్నేహం పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని, ”సరదాగా కాసేపు అంటూ, బైకు మీదెక్కించుకుని, నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి, మానభంగంతో ఆగక, ప్రాణం తీసి, తరువాత పోలీసులకు దొరక్కూడదని ఆ శవాన్ని, అమ్మాయిని తిప్పిన బైకులోని పెట్రోలే పోసి తగలేసే సంస్కృతి ఎక్కడిది? పోలీసులకి దొరికితే శిక్ష పడతాది అన్న భయం ఉందంటే, దానర్థం తను చేసేది తప్పనేగా! అయినా, తెలిసీ తప్పులు చేస్తూ, ఆచారాలు దొరక్కుండా తప్పించుకునే ఆలోచనలు చేసి రోజుల్లో ఉన్నాం మనం. ఉద్యోగాలపేరుతో అమ్మాయిలు బయటకి వెళ్లడం తప్పదు.

తోటి ఉద్యోగులతో మాట్లాడటం, కలిసి ఉండటం తప్పదు. అబ్బాయిలిద్దరు ఉండేంత సహజంగా, అమ్మాయి అబ్బాయి ఉండలేని పరిస్థితి. మాట్లాడే అయిదు మాటల్లో తప్పక అమ్మాయిల గురించి వెకిలి కామెంట్స్‌, అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడటం, చులకనగా చూడటం, మహిళా అధికారి కింద పనిచెయ్యడం అంటే ప్రాణం మీదకి వచ్చినట్లు ఉండటం వంటివి చాలా సహజం అయిపోయాయి. ఉద్యోగాల్లోనైనా అంటే, ఇళ్లలో కూడా అదే పరిస్థితి! భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులే అయినా, ఉద్యోగం నుండి వచ్చాక భర్త కాళ్లు చాపి టీవీ ముందు కూర్చుంటే, భార్య కొంగు బిగించి ఇంటి పనులు చెయ్యాలి. సామాజిక న్యాయం ఎక్కడ! ఇంటికి ఏ బంధువ్ఞలు వచ్చినా భార్యే శెలవ్ఞ పెట్టి చూసుకోవాలి. ”భర్తకే కుదరదు.ఎందుకు కుదరదు అంటే జవాబుండదు.

ఇంకో పక్క ఉద్యోగంలో భార్యకి ఏదైనా రిమార్క్‌ వస్తే, అదో తంటా! దానిమీద బోలెడు కామెంట్స్‌! సభ్యసమాజం అని పిలుచుకునే మన ప్రస్తుత సమాజంలో, ఆడపిల్లల రక్షణకి ”షీటీమ్స్‌ అని కొత్తగా, ప్రత్యేకంగా బృందాలు ఏర్పడాలా? రోడ్డుమీద వెళ్లే ఆడపిల్లల్లో తమ కూతుళ్లని, చెల్లెళ్లనీ, తోబుట్టువ్ఞలనీ చూసుకోలేని బ్రతుకు మనిషి బ్రతుకేనా! చిన్నచిన్ని పాపలని కూడా కామపు చూపులతో చూసే పక్కింటి అంకుల్స్‌, ఆటో అంకుల్స్‌, షాప్‌ అంకుల్స్‌, వరసకి అన్న, బాబా§్‌ు అయినా, వావివరసలు లేకుండా ప్రవర్తించే పశువ్ఞలకి భయపడుతూ బ్రతికే రోజులు ఎలా మారాలి, ఎప్పుడు మారాలి? జరిగింది తెలిస్తే పరువు పోతాదని భయపడుతూ కూర్చోక, మొన్నమొన్న ఉత్తరప్రదేశ్‌లో బస్సులో విసిగించిన తోటి ప్రయాణీకుడిని చితకబాదిన సోదరీమణుల్లాగ, విమానంలో వెనక సీటు నుండి ముందు సీట్లోని అమ్మాయిని తడమడానికి ప్రయత్నించిన అరవై దాటిన బిజినెస్‌మాస్‌ని చితకబాదినట్లు, ఆడపిల్లలూ, ఆడవారందరూ తిరగబడి, వెకిలిచేష్టలు చేసిన వాడి పరువు తీస్తూ ఉంటే, వెకిలితనానికి ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే! ఒకసారి పేపర్‌ ముందేసుకుని లెక్కపెట్టడం మొదలుపెడితే, ఇలాంటి ఉదంతాలు అరడజనుకు తక్కువ ఉండవు

. సంఘటన జరిగిన కొత్తలో కొంత హడావిడి, అలజడి, కొన్నాళ్లకు మరపున పడిపోతాది. వాటికి మనస్పందన తాత్కాలికమే అయితే, సమాజంలో అవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మన ఆలోచన మార్చుకుని, చుట్టూ జరుగుతున్న విషయా లను గమనిస్తూ, ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంటే, కనీసం ఒక పది పదిహేనేళ్లకు పరి స్థితి బాగుపడదా? పరువ్ఞ అన్నది ఆడవాళ్లకీ, వాళ్ల కుటుంబాల కేనా? ఒక్కసారి మగవాడు అల్లరిపడితే, అతని కుటుంబానికి కూడా అదే పరిస్థితి కదా! ఒకసారి ఆలోచించండి! పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడటం మాని, అమ్మాయిలే తిరగబడాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తాది.

– మృదుల