ఎదిగే ఆరాటంలో ఇబ్బందులు

6666666

ఎదిగే ఆరాటంలో ఇబ్బందులు

త్వరగా ఎదగాలనే తపనతో, ఆరాటంతో బాలికలపై పడుతున్న సామాజిక ఒత్తిళ్ల కారణంగా వారి మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటోందని ఓ తాజా అధ్యయనం తెలిపింది. పత్రికల్లో, వెబ్‌సైట్లలో కనిపించే సమాచారం, లైంగిక భావనలు వంటి వాటి ప్రభావానికి బాలికలు గురవ్ఞతుండటంలో వారిలో ఆహారపద్ధతుల్లో తీవ్రమార్పులు దూకుడుతనం, స్వీయహాని వంటి దుర్లక్షణాలు పెరుగుతున్నాయని ఈ అధ్యయనం హెచ్చరించింది.

గర్ల్‌ గైడింగ్‌ యుకె, మెంటల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం మేగజైన్లు, వెబ్‌సైట్లు వంటి వాటిలో బాలికలు చూస్తున్న దృశ్యాలు, చదువుతున్న విషయం వారిలో తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తున్నాయని తేలింది. ఎ జనరేషన్‌ అండర్‌ స్ట్రెస్‌ అనే శీర్షికతో ఉన్న ఈ అధ్యయన నివేదిక లండన్‌ బాలికల్లో పెరుగుతున్న మానసిక దుష్ప్రభావాల తీవ్రతకు అద్దం పట్టింది. పత్రికల్లో, వెబ్‌సైట్లలో కనిపించే మోడల్స్‌, పాప్‌స్టార్స్‌, నటీమణులను చూసి కొద్ది లండన్‌ బాలికలు తమను తాము కించపరచుకోవడం ఎక్కువవ్ఞతోందట. సన్నగా ఉండాలని, రివటల్లాంటి శరీరాలను రూపొందించుకోవాలని ఈ పత్రికలు వెబ్‌సైట్లు సూచిస్తుండటంతో బాలికలు ఈ లక్ష్యసాధన కోసం మాదక ద్రవ్యాలను వాడుతున్నారని, ప్లాస్టిక్‌సర్జరీ కూడా చేయించుకుంటున్నారని అధ్యయనం తెలిపింది. ఆన్‌లైన్‌ సర్వే నుండి సాగించిన ఈ అధ్యయనం ప్రకారం పదేళ్ల వయసు కలిగిన లండన్‌ బాలికలు తాము త్వరగా ఎదగాలనే ఒత్తిడికి తీవ్రంగా గురవ్ఞతున్నారని తెలుస్తోంది.

ఇది ఏ స్థాయికి పోతుందంటే బాలికలు తాము యువతులుగా, తమ వయసును మించి తమను ప్రదర్శించే రకం దుస్తులను వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంటే టీనేజ్‌ కూడా లేని బాలికలు టీనేజ్‌ యువతులకు పట్టే దుస్తులను ధరించాలనే ఆలోచనను కలిగి ఉంటున్నారు. మెంటల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఈ విషయమై మాట్లాడుతూ పెద్దలుగా మనం సృష్టించిన సమాజంలో బాలికలు, యువతులు, అసహజరీతిలో త్వరగా ఎదిగిపోవాలనే ఒత్తిడికి గురవ్ఞతున్నారని చెప్పారు. ఈ ఒత్తిడి వారి భావోద్వేగస్థితికి హాని కలిగిస్తోందని చెప్పారు.అతి త్వరగా తాము శారీరకంగా ఎదిగిపోవాలనే తపనకు, ఆతృతకు బాలికలు, యువతులు గురవ్ఞతున్నారని, తమ ప్రవర్తనను నిర్దేశిస్తున్న ఆదర్శ నమూనా మహిళలు వీరిలో ఒత్తిడిని ఆందోళనను పెంచుతున్నారని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధక విద్యార్థులు చెప్పారు. తాము ఆరాధిస్తున్న వారి శారీరక ప్రమాణాలను తాము సాధించలేదన్న అనుభూతికి వీరు లోనయ్యారంటే తామిక పనికి రామనే న్యూనతా భావానికి గురువ్ఞతున్నారని గర్ల్‌గైడింగ్‌ యుకె ట్రస్టీలో ఒకరు చెప్పారు.
వయో పరిపక్వత లేకుండానే లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం, వ్యాపార సంస్కృతి పాల్పడటం, ఒత్తిడితో తప్ప తాగడం వంటి దుష్ప్రభా వాలకు గురవుతున్న బ్రిటన్‌ బాలికలు కొత్తతరం మానసిక ఆరోగ్య సమస్య లకు పాల్పడుతున్నారని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇది చివరకు కుటుంబాల విచ్ఛిత్తికి కూడా దారితీస్తోందని నివేదిక తెలిపింది.