ఉత్సాహాన్ని పెంచే వ్యాయామం

O-EXERCI
attractive young woman runs on a treadmill, is engaged in fitness sport club; Shutterstock ID 122610268; PO: aol; Job: production; Client: drone

వ్యాయామం వల్ల యవ్వనం తిరిగి వస్తుంది. వీటన్నిటికంటే క్రమం తప్పని శారీరక వ్యాయామం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో శారీరకంగా అందంగా మానసికంగా ఉన్నతంగా తయారవ్ఞతారు. దీంతోపాటు వ్యాయామం వలన మన శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్‌ సహజమైన బాధానివారిణిగా పనిచేస్తాయి. ఆత్రుతను తగ్గిస్తాయి. మీ శరీరంలో ఫీల్‌గుడ్‌ హార్మోన్లు తయారుకావడానికి మీరు క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లడం లేదా విపరీతమైన వ్యాయామం చేయనవసరం లేదు. ఇంట్లో, పార్క్‌లో, బీచ్‌లో మీకు అనువైన చోటనే మీరు ఈ హార్మోనులను పొందవచ్చు.

వ్యాయామానికి కావలసింది వస్తుసామగ్రి కాదు.

• అసలే లావ్ఞగానో, బొద్దుగానో ఉండి వ్యాయామం చేయాల నుకుంటే, ప్రారంభంలోనే కఠినమైన శ్రమ ఎంచుకోకూడదు. తొలుత నెమ్మదిగా, చిన్నచిన్నగా ప్రారంభించి క్రమంగా వేగం పెంచాలి. లేదంటే ఆరంభశూరత్వమే మిగులుతుంది
•పూర్తిగా మానేయడం కంటే ఎంతో కొంత వ్యాయామం కొనసాగించడం మంచిది. నెమ్మదిగా సరిగ్గా అరగంట పనిచేసినా చాలు.
• మనలోని హ్యాపీ హార్మోనులు విడుదలయ్యే కొన్ని ఖచ్చితమైన వ్యాయామాలేమిటో తెలుసుకుందాం.
• అతి సాధారణంగా ఆచరించే ప్రాణాయామం, స్ట్రెచింగ్‌ వంటివి వార్మప్‌కు మంచిది. నిలుచుని, కూర్చుని నోటిని మూసివేసి ముక్కుతో గాలిపీల్చడం, వదలడం నెమ్మదిగా చేయండి. మళ్లీ గుండెల నిండా ఇదేవిధంగా గాలి పీల్చి వదలండి. ఈత, నడక, జాగింగ్‌, సైకిల్‌ తొక్కడం కొత్తగా వ్యాయామం ప్రారంభించినవారికి ఉపయోగకరంగా ఉంటాయి. కొద్దిగా నడిచిన తరువాత జాగింగ్‌ చేసి స్కిప్పింగ్‌ చేయండి. ఇది ఎక్కడైనా, ఎప్పుడైనా చేయడానికి అనువైన చక్కని వ్యాయా మం. మేడ మెట్లు ఎక్కడం అన్నింటి కంటే మేలైన వ్యాయామం. ముఖ్యంగా శరీరంలోని నడుము కింది భాగానికి ఇది మంచి వ్యాయామం అవ్ఞతుంది. కంప్యూటర్‌ రంగంలో పనిచేసేవారికి, గంటల తరబడి కూర్చుని పనిచేసేవారికి ఇలా కొద్దిసేపు మెట్లు ఎక్కి దిగడం మంచిది. గుండెకు సంబంధించిన రక్తనాళాలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శరీరం బరువ్ఞ తగ్గే సరదా పద్ధతి ఏమిటంటే, సరదాగా ఓ అర్థగంట మీకిష్టమైన డాన్స్‌ చేయడమే. కూచిపూడి నుండి కథాకళి వరకూ ఏది నచ్చితే అది చేయవచ్చు.
్య పరుగెత్తలేనివాళ్లు, చాలా సంవత్సరాలుగా వ్యాయామం చేయనివారు సూర్యనమస్కారాలతో ప్రారంభించినా చాలు రోజంతా ఉల్లాసంగా ఉంటారు. కేవలం వ్యాయామమే కాదు భోజనం కూడా ఫీల్‌గుడ్‌ భావన కలిగిస్తుంది.

పూర్తిగా మానేయడం కంటే ఎంతో కొంత వ్యాయామం కొనసాగించడం మంచిది. నెమ్మదిగా సరిగ్గా అరగంట పనిచేసినా చాలు.