ఉగాది పచ్చడి ప్రాముఖ్యత

UGADI
UGADI

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత

ఇక ఉగాది పచ్చడి ప్రత్యేకతే వేరు. షడ్రుచుల సంగమం అయిన దీన్ని సేవిస్తే, ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది. వేపపువ్ఞ్వలో క్రిమిసంహారక గుణాలున్నాయి. వేపపూతను నమిలితే, కుష్టు, మధుమేహం, క్షయ, దగ్గు, జలుబు, ఒంటిపూత, జలుబు, జ్వరం, అమ్మవారు, ఒంటిదద్దుర్లు మొదలైన లక్షణాలు తగ్గుతాయి. మామిడి ముక్కలు రక్తప్రసరణ దోషాలను నివారిస్తాయి. వేడిని తగ్గించి, శరీరానికి చలువనిస్తాయి. గొంతురోగాల్ని, చిగుళ్లువాపుని, నోటిపూతను, వడదెబ్బను, అతి దాహాన్ని పొగడతాయి. చింతపండు వాతరోగాన్ని హరిస్తుంది. మూత్రపిండాలలోని రాళ్లను కరిగిస్తుంది. అరుచిని పోగుడుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. ”బెల్లం రక్తహీనతను పోగొడుతుంది. వాత, పిత్త, కఫ, దోషాల్ని పోగొట్టి ఆరోగ్యానిస్తుంది. పచ్చిమిరపలో వాతాన్ని పోగొట్టే గుణం ఉంది. ఉప్పు అజీర్ణాన్ని పొగొడుతుంది. వీటన్నిటి కలయికయే ”ఉగాది పచ్చడి కాబట్టి ఈరోజునే ప్రారంభించాలి.