ఈ వంటల్లో మేలెంత?

Cooking111
Cooking

ఈ వంటల్లో మేలెంత?

 

నాగరికత పెరిగే కొలదీ రుచులు పెరుగుతున్నాయి. జిహ్వచాపల్యం తీర్చడానికి అనేక రకాల వంటలను సిద్ధం చేస్తున్నారు. కానీ, ఆరోగ్యాన్ని చేకూర్చే వంటలకు ప్రాధాన్యత తగ్గింది. మా ‘ఇంటి వంట దారి ఎక్కడా లేదనేది వాస్తవం. బజారు ఫుడ్స్‌లో నాణ్యత లోపిస్తుంది. శుచి, శుభ్రత కానరావు. ఆహారపదార్థాలలో కొన్నింటిని బాగా ఉడికించాలి. మరి కొన్నింటిని అనువైన పాత్రలలోనే వండాలి. ఏ వంటలు ఆరోగ్యానికి మేలో తెలుసుకుందాం.
స్టీమింగ్‌: స్టీమింగ్‌లో ఉడికిస్తే ఆరోగ్యానికి మేలు. పోషకపదార్థాలు వ్యర్థం కావ్ఞ. వేడిగా తినటానికి అనువ్ఞగా ఉంటాయి. కూరగాయలైనా, పళ్లయినా స్టీమ్‌ చేస్తే పౌష్టికత లోపించదు.

బాయిలింగ్‌ (ఉడికించటం):
ఉర్లగడ్డలు, అన్నం, చికెన్‌, మాంసంలను ఉడికించాలి. కూరగాయలను స్టీమింగ్‌ చేసినట్లు చేయరాదు. ఉడికేదాకా పొయ్యిపై ఉంచాలి. అయితే అతిగా ఉడికిస్తే విటమిన్లు కోల్పోతాయి.

బేకింగ్‌:
వేయించటానికి బదులు బేకింగ్‌ పౌష్టికతను కాపాడుతుంది. తక్కువ వేడిలో వండాలి. బేకింగ్‌లో ఎక్కువ సమయం పడుతుంది. భేల్‌పూరీ లాంటి పూరీలు మాంసం బేకింగ్‌ చేస్తే నయం. వేపుడు కంటే బేకింగ్‌ మేలు.

సాటింగ్‌:
వేపుడుకు ప్రత్యామ్నాయం సాటింగ్‌. మంచి రుచి, నూనెలో వండాలనుకున్నప్పుడు కూరగాయలను సాటింగ్‌ చేయాలి. తక్కువ నూనె పడుతుంది. ఆలివ్‌ ఆయిల్‌ ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ నూనె ఆరోగ్యానికి హానికరం.

పోచింగ్‌:
మాంసాన్ని నీళ్లలోకానీ, కూరలతో ఉడికించటం, స్టీమింగ్‌ కంటే తొందరగా ఉడుకుతుంది. మాంసానికి కూరలను చేర్చటం వల్ల పౌష్టికత లోపిం చదు. ముఖ్యంగా మాంసాహారాన్ని పోచింగ్‌ విధానంలో ఉడికించాలి.