ఈడేరే వయసులో బరువెక్కితే?

TEENAGE
TEENAGE

ఈడేరే వయసులో బరువెక్కితే?

రజస్వల అయ్యే వయసులో కొంతమంది అమ్మాయిలు బరువ్ఞ పెరుగుతుంటారు. రజస్వల అయ్యాక మామూలు స్థితికి వచ్చేస్తారు. మరికొంతమంది అమ్మాయిలు ఆ తరువాత కూడా బరువ్ఞ పెరుగుతూ ఉంటారు. బరువ్ఞ బాగా పెరిగిన తరువాత కాక ముందుగానే ఈ అంశం మీద దృష్టిపెడితే, పరిష్కరించుకోవడం తేలిక అవ్ఞతుంది. దానికి ఏం చెయ్యాలో తెలుసుకుందాం! బరువ్ఞ ఎక్కువగా పెరిగితే మెన్సెస్‌ సక్రమంగా రాకపోయే సమస్య వస్తుంది. మెన్సెస్‌ సరిగ్గా రాకపోతే బరువ్ఞ పెరుగుతుంది. ఇవి రెండూ ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో శరీరం అలసిపోయేలా బయట ఆట లాడటం తగ్గిపోయింది. అలాకాక చిన్న వయసు నుండి ఆటలు, వ్యాయామాలు అలవాటు చేసు కుంటే బరువ్ఞ బాధ తగ్గిపోతుంది. థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు ఆ మందులే తప్పనిసరిగా వాడాలి. మెన్సెస్‌ సరిగ్గా రావడం లేదని హార్మోన్‌ మాత్రలు వాడడం మంచిది కాదు. వాటి వలన కూడా బరువ్ఞ ఎక్కువగా పెరుగుతారు. మెన్సెస్‌ సరిగ్గా రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసు కుని, అవసరం అయితే ఆయుర్వేద ఔషధాలు వాడడం శ్రేయస్కరం. నిత్యం జాగింగ్‌, స్కిప్పింగ్‌, నడక, యోగ వ్యాయామాలు ఏవో ఒకటి తప్పనిసరిగా చేయాలి. బరువ్ఞ తగ్గడానికి మందులు ప్రయత్నించడం కంటే ఆహార, విహార సమయాలు పాటించడమే మంచిది. అతిగా ఉన్న బరువ్ఞని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలనుకోవడం వరకూ మంచిదే. అంతేకానీ ఐశ్వర్యారా§్‌ులా, బార్బీబొమ్మలా తయారుకావాల నుకుంటూ అతిగా వ్యాయామాలు చేయడం, అసలే తిండి తినకుండా ఉండడం, భవిష్యత్తులో అనా రోగ్యానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సమయంలో శారీరక వ్యాయామాలు చేస్తూ, ఆహారంలో కొవ్ఞ్వ పదార్థాలు తగ్గిస్తే, బరువ్ఞని నియంత్రించుకోవచ్చని అనేక పరిశోధనలు నిరూపించాయి.