ఇంటి భాష కంటికి వెలుగు

Studying
Studying

ఇంటి భాష కంటికి వెలుగు

తెలుగుభాషను చదవడమూ, భారతీయ సంస్కృతిని అలవరచుకోవడమూ దండుగే అనుకునే రోజుల్లో మన మాతృభాషను వల్లెవేయాల్సిన తల్లిదండ్రులే ఇంగ్లీషు భాష మోజులో పడిపోతున్నారు. ఎంతో సంప్రదాయబద్ధంగా వ్యవహరించాల్సిన తల్లిదండ్రులు కూడా అమ్మా,నాన్న అని పిలిపించుకోవడమే మానివేస్తున్నారు. హలో మమ్మీ, హా§్‌ు మమ్మీ, హాలో డాడీ, హా§్‌ుడాడీ వంటి మాటలకే మురిసిపోతున్నారు. రానున్న తరాల వారు పూర్తిగా తెలుగు భాషనే మరిచిపోయేలా ఉన్నారు.

ఏమాత్రం తెలుగు మాట్లాడినా తెలుగక్షరాలు తారసపడినా, ఆంగ్లం మరచిపోతారనే భావనతో తెలుగు మాటను దరిచేరనీయడం లేదు. తెలుగు మాటంటేనే చీదర. అందుకే తెలుగు పట్ల ఆసక్తిపోతోంది. కాస్త ఒకటో, రెండో పదాలు వచ్చినా, వచ్చీరాని ఆ తెలుగులో కొన్ని పదాలు వింటుంటే తెలుగుకు తెలుగొచ్చేసింది బాబో§్‌ు అనే ధోరణిలో ఉన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 21న నిర్వహించాలని 2000నాటి నుంచే ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఏ దేశానికి ఆ దేశభాష మెండు. ఏ రాష్ట్రానికి, ఆ రాష్ట్రభాష మెండు.

అలాగే ఏ ప్రాంతానికి ఆ ప్రాంత మాండలిక భాష మెండు అని ఇపుడిపుడే ఒక అవగాహన పెరుగుతున్న రోజులివి. ఇలాంటపుడైనా స్వదేశంలోని మాతృభాషను మరిచిపోతే ఎలా? దీనివలన అటు ఇంగ్లీషు పూర్తిగా రాక, తెలుగు పదాలను కూడా పట్టి పట్టి పలకడంలో తెలుగు స్ఫూర్తి దెబ్బతింటుంది. నిజానికి తెలుగు భాష కూడా భవిష్యత్‌లో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కనుమరుగయ్యే భాషల్లోకి చేరిపోతుందని ఐ.రా.స. సంస్థ ఏనాడో తేల్చి చెప్పింది. పరభాషా సంస్కృతుల మోజులో దేశం వదలి వెళ్లిపోతున్నట్లు వాపోతున్నది.

నిజమే అయితే మనం మన మాతృభాషను ఏ మేరకు పూజిస్తున్నామన్నది తెలుసుకోరు. తెలుగు చదువ్ఞల సంస్కృతి దాదాపు,తెలుగువారి ముంగిట్లోంచి మాయమైనట్లే ఉంది. 2013 సంవత్సరాన్ని తెలుగుభాషా సంస్కృతిల వికాస సంవత్సరంగా ప్రకటించినప్పటికీ తెలుగుభాషకు ప్రాణం పోయలేకపోయాం. తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చేయాలా వద్దా అన్నది ఇప్పటి సమస్య. దీనిపై ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు ప్రకటించకపోవటంతో ప్రతి అంశం సమస్యాత్మకమే అవ్ఞతోంది. ఇలాంటి పరిస్థితిలో తెలుగును కనీసం ‘ఇంటి భాషగానైనా నిలబెట్టుకోవాలన్న ఆకాంక్ష ఈతరం వారది. తరమేదైనా మాతృభాషను మృతభాష చేసుకోవాలని ఎవరూ అనుకోరు. కానీ ఆంగ్లభాషా ప్రపంచంలో మమేకమైన ఏ విద్యార్థి మాతృభాషపై దృష్టి సారించలేకపోతున్నాడు. అ,ఆలు వచ్చా ‘అమ్మ అని రాయగలవా? పోనీ ‘క గుణింతమైనా వచ్చా, అని ఏ పిల్లల్నడిగినా గుడ్లుతేలేస్తారు. ఇటీవల జరిగిన ‘ఆసర్‌ అధ్యయనంలో ఇలాంటివెన్నో తెలిసాయి.