ఇంకెప్పుడు ఆడపిల్లలకు భద్రత?

PRIYANKA
PRIYANKA


ఆడవారు అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్య్ర వచ్చినట్లు అన్న గాంధీ మహాత్ముడి మాటలు నిజం ఎప్పుడు అవుతాయో తెలియదు కాని, చీకటిపడుతున్న సమయం నుండే మృగాళ్లు పొంచి ఉంటున్నారన్న నిజం మాత్రం నిజమవుతున్నది. వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి విషయంలో అదే నిజమైంది. సాయంత్రం ఆరు గంటల నుండే ఆమెపై కన్నేసిన దుర్మార్గులు నలుగురు కలిసి ఆమెపై సాగించిన దారుణం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. కేవలం హైదరాబాద్‌ నగరంలోనే కాదు ఈ దారుణ సంఘటన దేశవ్యాప్తంగా పలువురిని కదిలించింది. జాతీయ నాయకులు సైతం ఈ దురాగతాన్ని ఖండించారు. పశువైద్యురాలు ప్రియాంక ఎన్నో పశువుల రోగ లక్షణాలు తెలుసుకుని చికిత్స చేయగలిగింది. కాని మానవ మృగాళ్ల కళ్లలోని పశువాంఛను గమనించలేక పోయింది. సాయంత్రం 5 గంటల తరువాత శంషాబాద్‌లోని నక్షత్ర కాలనీలోని తన ఇంటి నుంచి బయల్దేరిన ప్రియాంక ఆరుగంటలకు తొండుపల్లి ప్లాజా వద్ద తన స్కూటీని పెట్టి గచ్చిబౌలికి వెళ్లింది. తొమ్మిది పదిహేను నిమిషాలకు అక్కడకు చేరుకున్న ప్రియాంక స్కూటీ పంక్చరవడం గమనించి చెల్లెలికి ఫోన్‌ చేసింది. అక్కడే పొంచి ఉన్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు కలిసి పథకం ప్రకారం ఆమె వాహనంలో గాలి తీసేసారు. చెల్లెలితో మాట్లాడుతున్న ప్రియాంకను ఆమె చెల్లి అనేక విధాలుగా హెచ్చరించింది. అయినప్పటికీ ప్రియాంక ఆ సమయంలో అర్ధం చేసుకోలేక పోయిందో మరేమో గాని నలుగురు దుర్మార్గుల అకృత్యానికి గురైంది. కర్ణాటక రాయచూర్‌ నుంచి ఇటుకలోడ్‌తో వచ్చిన నిందితుల్లో ఒకడై మహ్మద్‌ ఆరీఫ్‌తో శివ అనే అతడు కూడా ఉన్నాడు. వారికి మరో ఇద్దరు తోడయ్యారు. తొండుపల్లి వద్ద లారీని ఉంచి అక్కడే మద్యం తాగుతున్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రియాంక స్కూటీ పార్కు చేయడం చూసిన వారు ఆమె తన వాహనం కోసం మళ్లీ అక్కడే వస్తుందని, ఆమెపై అఘాయిత్యం చేసేందుకు ప్రణాళికను రూపొందిం చుకున్నారు. వాహనం వెనుక టైర్‌లో గాలి తీసేస్తే ఆమె వెళ్లలేదని దాంతో తమ పని కానివ్వచని వారిలో ఒకడు ఇచ్చిన అయిడియాతో వెనుక టైరులో గాలి తీసేశారు. అనుకున్నట్లుగానే 9 గంటల తరువాత వచ్చిన ప్రియాంక వెనుక టైరులో గాలి లేకపోవడం చూసి సోదరితో మాట్లాడుతున్న సమయంలో నిందితుల్లో ఒకడు ఆరిఫ్‌ మరో వ్యక్తి శివను పిలిచి బండి పంక్చర్‌ వేయించుకురమ్మని పంపాడు. శివ తిరిగి వచ్చి షావులు మూసి వున్నాయని చెప్పాడు. ఆమెను అక్కడే ఆపాలన్న ప్లాన్‌తో మరో చోటికి వెళ్లి వేయించుకురమ్మని పంపాడు. అదే సమయంలో ఆమెను అక్కడి నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా తీసుకువెళ్లి లారీని అడ్డుగా పెట్టారు. అంతలో బండికి పంక్చర్‌ వేయించుకొస్తానని తీసుకెళ్లిన శివ కూడా వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న నలుగురు ఆమెపై లైంగిక దాడి చేశారు. ఆమె ప్రతిఘటించ కుండా ఆమె నోటిలో బలవంతంగా మద్యం పోశారు. నలుగురు దుండగులు 45 నిమిషాల పాటు ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. అచేతన స్థితికి చేరుకున్న ప్రియాంక నోరు, ముక్కును మూసివేయడంతో అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని లారీలో ఉన్న రగ్గులో చుట్టి క్యాబిన్‌లో ఎక్కించారు. లారీ నడుపుకుంట ఇండియన్‌ ఆయిల్‌ బంకుకు వెళ్లి పెట్రోల్‌ పోయించుకుని షాద్‌నగర్‌ శివారు చటాన్‌పల్లి వంతెన వద్ద మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిందని నిర్ధారించుకున్నాక స్కూటీన్‌ వదిలేసి నలుగురు లారీలో అక్కడి నుండి వెళ్లిపోయారు. తెల్లవారుఝామున అటు నుండి వెళుతున్న వారు మృతదేహం కాలిపోయి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అది ప్రియాంకదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక ఏం పాపం చేసిందని నలుగురు ఆమెపై అంత కిరాతకంగా ప్రవర్తించారు అన్న సందేహం ప్రతి ఒక్కరిని పీడిస్తున్నది. రంగంలోని దిగిన పోలీసులు నిందితులు నలుగురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
నీచమైన ఈ సంఘటనపై ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ నిందితులకు తామే శిక్ష వేస్తామని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సభ్యసమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ అకృత్యాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాగ్‌ కోర్టులో విచారిస్తున్నారు. తీవ్ర ఆవేదనతో ఉన్న ప్రియాంక కుటుంబ సభ్యులు నిందితులను ఉరి తీయాలని, వారి తరపున ఎవరూ వాదించవద్దని కోరుకుంటున్నారు. జరగరాని ఘోరం జరిగిపోయింది. ఒక నిండు ప్రాణం అత్యంత దారుణానికి గురైంది. టోల్‌గేటు దగ్గరకు వెళ్లు బండి వదిలేసి వచ్చే§్‌ు, రేపయినా తెచ్చుకోవచ్చు అన్న సోదరి మాటలు వినిపించుకోలేకి ప్రియాంక మృగాళ్ల రాక్షసకాండకు బలైంది. సమస్యను ఎదుర్కొనే ధోరణిని అమ్మాయిలకు మొదటి నుంచి అలవాటు చేయాలి. సమయస్ఫూర్తితో స్పందించేలా ఉండాలని పోలీసు అధికారులు అంటున్నారు. చాలా మందికి యాప్‌లే తెలుస్తాయి. కాని సాంకేతికపరంగా వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలిసుండాలంటున్నారు. ఫోన్‌లోని మ్యాప్స్‌లో లైవ్‌ లొకేషన్‌ షేరింగ్‌ ఉంటుంది. దాన్ని ఆన్‌ చేసి, కుటంబసభ్యులకు షేర్‌ చేస్తే ఎక్కడ ఉన్నది వారు తెలుసుకోగలుగుతారు. ఈ రోజల్లో ఆత్మరక్షణకు ఉపయోగపడే రిస్ట్‌బ్యాండ్‌లు, గడియారాలు, గొలుసులు, నడుమకు కట్టుకునే గ్యాడ్జెట్లు ఎన్నో ఉన్నాయి. ఎవరైనా మనకు హాని చేయాలనుకుంటే మొదట లాక్కునేది ఫోన్‌. కాబట్టి వీటిని ధరిస్తే సమస్య ఎదురైన సమయంలో వీటి సాయంతో సన్నిహితులను అప్రమత్తం చేయవచ్చంటున్నారు అధికారులు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఆడపిల్లలు, మహిళలు అప్రమత్తంగా ఉండాలి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌:https://www.vaartha.com/news/international-news/