ఆరోగ్య చిట్కాలు

                   ఆరోగ్య చిట్కాలు

health tips
health tips

్జ అన్నంతో పాటు టమాట, దోసకాయ, కేరట్‌, ముల్లం గి ముక్కలు సన్నటి ముక్కలుగా కోసిన కేబేజ్‌ని తింటే శరీరానికి కావలసిన విటమిన్స్‌ లభిస్తాయి.
్జ అకస్మాత్తుగా అన్నం తగ్గిస్తే కడుపుకుండే ఎలాస్టిసిటీ వల్ల ఆకలి వేస్తుంది. అంచేత క్రమక్రమంగా అన్నం తగ్గించుకుంటూ వెళితే కడుపు ముడుచుకుని ఆకలి తగ్గుతుంది.
్జ లావ్ఞగా ఉన్నవాళ్లు డైటింగ్‌ చేయాలనుకుంటే కార్బొహేడ్రేట్స్‌, కొవ్ఞ్వ పదార్థం గల ఆహారపదార్థాలనే తినడం మానేయాలి తప్ప విటమిన్స్‌, ప్రొటీన్స్‌ గల పదార్థాలను మానేయకూడదు.
్జ రోజుకి రెండు అరటిపండ్లు తింటే, రోజూ మనిషికి కావలసిన ‘సి విటమిన్‌లో నాలుగోవంతు లభ్యమవ్ఞతుంది.
్జ హైబి.పి ఉన్నవారు కొలెస్టరాల్‌ అధికంగా ఉన్నవారు రోజూ ఉదయం అన్నం తినబోయే ముందు నాలుగు వెల్లుల్లి బద్దలు తింటే మంచిది. పచ్చివి తినడం కష్టం కాబట్టి అన్నం ఉడికాక అందులో ఆ నాలుగు బద్దలని గుచ్చి ఉంచితే, వేడి చల్లారేలోగా అవి ఉడుకుతాయి. వాటిని తినచ్చు.
్జ గోరుచుట్టు వచ్చినప్పుడు గోరింట ముద్ద ఆ వేలికి కొన్నాళ్లు పూస్తే ఉపశమనాన్నిస్తుంది.
్జ కళ్లజబ్బు ఉన్నవారు కేరట్స్‌, యాపిల్స్‌ అధికంగా తింటే (కంటికి అవసరం అయిన కెరొటిన్‌ వాటిల్లో ఉంది కాబట్టి) కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
్జ నిద్రపట్టని రాత్రులు కొద్దిగా చక్కెరని నీటిలో కలుపుకుని తాగితే నిద్రపడుతుంది.
్జ హాయిగా నిద్రపట్టడానికి మరో చిట్కా. పాలలో చక్కెర కలుపుకుని వేడివేడిగా తాగి పడుకోవడం. మరీ వేడిగా తాగకూడదు. గోరువెచ్చగా ఉండేలా తాగాలి.
్జ ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పుదీనారసం ముఖానికి రాసుకుంటే మొటిమలు పోవటమే కాకుండా శరీరం కూడా మృదువ్ఞగా ఉంటుంది.
్జ పెరుగును తలకు మర్దన చేసుకుని ఒక గుడ్డతలకు కట్టుకుని పడుకుంటే వేడి తగ్గి నిద్ర చక్కగా పడుతుంది.
్జ గింజలు లేని ద్రాక్షపండ్లను తినడం వల్ల ఆరోగ్యంతోపాటు టైమ్‌కి నిద్రపడుతుంది.
్జ పిల్లలకు కింద పడి శరీరం డోక్కుపోతే తేనే రాస్తే త్వరగా మానుతుంది. బ్యాక్టీరియా చేరదు.