ఆరోగ్యం మీ వెంటే

Totakoora Special dish

ఆకుకూరలు చేసే మేలు ఇంతా, అంతా కాదు. అందుకే నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండటం మంచిదని డాక్టర్లు సైతం చెబుతారు. ఆకుకూరల్లో అలనాటి నుంచి అత్యధికంగా వాడుకలో ఉన్నది తోటకూర. దానాలలో సైతం తోటకూర ఉంటుంది. అందుకే ‘దశదానాలకూ తోటకూర కట్ట అని ఓ సామెత కూడా ఉంది. ఆకుకూరల్లో ఆరోగ్యం దాగున్నా చాలామంది పిల్లలు ఆకుకూరలు తినడానికి అంతగా ఇష్టపడరు. ఆకుకూర పప్పు అనగానే అయిష్టంగా ముఖంపెట్టేవారే ఎక్కువ మంది కనిపిస్తారు. అయితే ఆ అయిష్టాన్ని ఇష్టంగా మార్చవచ్చు. ఎలాగంటారా? ఆకుకూరతో వైవిధ్యభరితమైన వంటకాలు చేయడం ద్వారానే. ప్రస్తుతం తోటకూరతో వెరైటీ వంటకాల పరిచయం మీకోసం…

స్వీట్‌పూరీ

కావలసినవి:
సన్నగా కట్‌చేసి పెట్టుకున్న తోటకూర -ఒకటిన్నర కప్పులు
మైదాపిండి-ఒక కప్పు, గోధుమపిండి-ఒక కప్పు
వేయించిన సేమ్యా-250గ్రాములు, పంచదార-200గ్రాములు
జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు -రెండు స్పూన్లు
ఇలాచిపౌడర్‌-పావ్ఞటీ స్పూన్‌, కాచిన పాలు-అర లీటర్‌
తేనె-ఒక స్పూన్‌, నెయ్యి-100గ్రాములు.,వేయించిన జీడిపప్పులు-20

తయారుచేసే విధానం
ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి మెత్తగా మిక్సీపట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్‌లోకి మైదాపిండి, గోధుమపిండిని తీసుకొని దానిలో మిక్సీపట్టిన తోటకూర పేస్ట్‌ రెండుస్పూన్‌ల నెయ్యి ఒక స్పూన్‌ తేనెవేసి, అలాగే తగినన్ని కాచినపోలుపోసి పూరీపిండిలా మృదువ్ఞగా వచ్చే టట్లు కలుపుకోవాలి. దీనిని చిన్నచిన్న బాల్స్‌గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కళాయి పెట్టి పాలుపోసి దానిలో వేయించిన సేమ్యా వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. ఇది బాగా ఉడికాక పంచదార, జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు, ఇలాచిపౌడర్‌, ఒకస్పూన్‌ నెయ్యివేసి మరికొద్దిసేపు ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరయ్యాక దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తోటకూర పూరీ పిండిబాల్స్‌ని పూరీల్లాగా ఒత్తాలి. ఇలా ఒత్తినవాటిలో ఉడికించిన సేమ్యా మిశ్రమాన్ని రెండు స్పూన్ల చొప్పున పెట్టి మడిచి గుండ్రంగా చేసి మరల పూరీలా ఒత్తాలి. ఇప్పుడు స్టౌమీద కళాయి పెట్టి ఒక స్పూన్‌ నెయ్యి వేసి వేడెక్కాక ముందుగా ఒత్తిపెట్టుకున్న పూరి వేసి పూరీపైన మరల కొద్దిగా నెయ్యి వేసి రెండు వైపుల దోరగా కాలాక తీసి సర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకొని జీడి పప్పుతో అలంకరించుకుని సర్వ్‌ చేసుకోవాలి.

వడలు:

కావలసినవి
తోటకూర-రెండు కప్పులు, మొక్కజొన్న విత్తులు-రెండు కప్పులు
కొబ్బరితురుము-అరకప్పు, సన్నగాకోసిన ఉల్లిపాయముక్కలు-అరకప్పు
వేయించిన జీడిపప్పు ముక్కలు-రెండు స్పూన్లు
బొంబాయి రవ్వ-రెండు టీ స్పూన్లు
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌ -రెండు టీ స్పూన్లు
సన్నగా కట్‌చేసిన పుదీనా, కొత్తిమీర-పావ్ఞకప్పు
జీర-ఒక టీ స్పూన్‌
ఉప్పు-రుచికి తగినంత, నూనె-తగినంత

తయారుచేసే విధానం:
ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా కట్‌ చేసి పెట్టుకోవాలి. మొక్కజొన్న విత్తుల్ని నానబెట్ట నవసరం లేదు. వీటిని ఒక సారి నీళ్లలో కడిగి నీళ్లు వంచేసి నీళ్లు పోయకుండా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇది మెత్తగా నలిగాక దీనిని ఒక బౌల్‌లోకి తీసుకొని దీనిలోనే కట్‌చేసి పెట్టు కున్న తోటకూర, కొబ్బరి తురుము, ఉల్లిపాయముక్కలు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌, బొంబాయిరవ్వ, పుదీనా, కొత్తిమీర, జీర, జీడిపప్పు ముక్కలు, తగినం త ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి తగినంత నూనె పోసి బాగా కాగాక, పాలిథిన్‌ కవర్‌పై రెడీ చేసి పెట్టు కున్న పిండిని వడలులాగా వత్తి మధ్యలో చిన్న గుంటలాగా తీసి నూనెలో వేసి రెండువైపులా దోరగా కాలేవరకు ఉంచి తీసి ముందుగా పేపర్‌ నాప్‌కిన్‌ పరిచిన ప్లేట్లో పెట్టి ఆ తర్వాత సర్వింగ్‌బౌల్‌లోకి తీసుకోవాలి. వీటిని అల్లం, చట్నీతో గాని, మాగాయ చట్నీతోగాని తింటే చాలా రుచిగా ఉంటుంది.

తోటకూర, గోంగూర రోటి పచ్చడి

కావలసినవి:
తోటకూర-రెండు కప్పులు, సన్నగా తరిగిన గోంగూర-ఒక కప్పు
ఉల్లి తరుగు-అరకప్పు,వెల్లుల్లిరేకలు-5, తాలింపుగింజలు-కొద్దిగా
ధనియాలు-ఒక స్పూన్‌, తెల్లనువ్ఞ్వలు-ఒక స్పూన్‌, మెంతులు-అర స్పూన్‌
ఎండుమిర్చి-5, పచ్చిమిర్చి-4, ఇంగువ-పావ్ఞస్పూన్‌
పసుపు-పావ్ఞ స్పూన్‌, నూనె-తగినంత, ఉప్పు-తగినంత
సన్నగా కోసిన కొత్తిమీర – రెండుస్పూన్లు

తయారుచేసే విధానం:
ముందుగా స్టౌమీద బాండీ పెట్టి తగినంత నూనె వేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టి సన్నగా కోసిన తోటకూర, గోంగూర వేసి కొద్దిసేపు వేయించి తీసి బౌల్‌లోకి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయముక్కల్ని కూడా కొద్దిగా నూనె వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరల స్టౌమీద బాండీ పెట్టి తగినంత నూనె వేసి తాలింపు గింజలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక పసుపు, ఇంగువ, వెల్లుల్లి రేకులు, తగినంత ఉప్పువేసి రెండు నిమిషాలు తిప్పి దించి రోట్లో వేసుకోవాలి. ఈ తాలింపుగింజల్ని కొద్దిగా వేడి తగ్గాక రోకలితో మెత్తగా దంచి ముందు వేగించిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా నలిగేవరకు దంచి ఆ తర్వాత దానిలోనే వేయించిన తోటకూర, గోంగూర వేసి మెత్తగా దంచి తీయాలి. దీనికి పైన కొత్తిమీర వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/