ఆధునిక సౌందర్య పద్ధతులు

                         ఆధునిక సౌందర్య పద్ధతులు

BEAUTY TIPS
BEAUTY TIPS

ధర్మోస్టాటిక్‌ చికిత్స చర్మం ముడతలు పడి ఎండిపోయి 30 సంవత్సరములలోనే 60 సంవత్సంలాగా కళాహీనంగా వ్ఞంటే చర్మానికి ఈ చికిత్స శ్రేష్టకరమైనది.ముఖకండరాలను యథాస్థితికితెచ్చి చర్మంపై వ్ఞండే ముడతలను పోగొట్టి వృద్ధాప్యఛాయలను పోగొడుతుంది ధర్మోస్టాటిక్‌ చికిత్స.ధర్మోడైనమిల్‌ చికిత్స జారిపోయిన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఈ విధానంలో విశేషమైన మూలికలను తయారుచేస్తారు. ఎండిపోయిన తర్వాత ముఖాకృతిలో ఊడివస్తుంది. ఈచికిత్సవల్ల వయస్సును పదినుండి 5 సంవత్సరములకు తగ్గినట్లు చేయవచ్చును. పారోధర్మో చికిత్స పొడిచర్మం గలవారికి మంచిది. ఈచికిత్సా విధానంలో వేడిగా వ్ఞన్న హెర్బల్‌ లోషన్‌ను చర్మంపై పూయడమువలన చర్మరంధ్రాలలోకి చొచ్చుకుపోయి శుభ్రపరచి పొడిగావ్ఞన్న చర్మాన్ని మృదువ్ఞగా మెత్తబరుస్తుంది. యాంప్యుల్‌ థెరపి ఎలక్ట్రాలజీయాంప్యూల్‌ థెరపి ఐదునుంచి ఎనిమిది సార్లుచేస్తే మొటిమలు పూర్తిగా నిరోధమవ్ఞతాయి. ఎలక్టోని థెరపి విధానంలో అవాంఛిత రోమాలను చర్మంమీదుండే వ్ఞలిపుర్లు, పుట్టుమచ్చలు,నల్ల, ఎర్రబొడిపెలను ధెడ్ర్‌వీన్స్‌ను ఎలక్రోటథెరపి ద్వారా పూర్తిగా తొలగించవచ్చును.

నెరసిన జుట్టును అరికట్టెదెలా : 40 సంవత్సరాలకే జుట్టు నెరవడం సహజం, 14 నుంచి 40 మధ్యలో నెరిసే జుట్టుకు విటమిన్‌లు, ప్రోటీన్‌లు లోపంకూడా కావచ్చు ఇన్‌ఫెక్షన్‌వల్ల కూడా జరుగుతుంది. తెల్లవెంట్రుక తీసి వేయదలచినపుడు 4 నుండి 5మి.మీ. మొదల్లో వదిలి మిగతాభాగం తుంచివేయాలి. ఎక్కువభాగం తెల్లవెంట్రుకలైతే వెజ్‌హెర్బల్‌ హెయిర్‌ డై చేయడం తప్పనిసరి. ఎలాంటి రసాయనిక చర్యలువ్ఞండవ్ఞ. బ్యూటీక్లినిక్సులో అనుభవమున్న బ్యూటీథెరపిస్టు ప్రత్యేకముగా ఆయిల్‌చేసిన హెయిర్‌డై వాడుట శ్రేయస్కరం.వైట్‌హెయిర్‌ స్లాపర్‌ కలబంధ మనుబాల గుంటకరక కచ్చూకము వంటివి జుట్టుకు సంబంధించిన 26 -32 రకాల ప్రత్యేక వనమూలికలతో తయారుచేసే పొడి గోరింటాకు 2:2 నిష్పత్తిలో మిశ్రమంచేసిన ఈ వైట్‌హెయిర్‌ స్టాపర్‌ తెల్లవెంట్రుకల ఆరంభదశలో 14 – 40 సంవత్సరముల వయస్సు వరకుఅరికట్టవచ్చు. తెల్లవెంట్రుకల ఉదృతాన్ని కొద్దిపాటి అరికట్టడానికి కొన్నిరకాల హెర్బల్‌ ట్రీట్‌మెంట్లు తాత్కాలికంగా ఇంటితో తయారుచేసుకొనవచ్చును.

ఇంటిలో తయారుచేసుకొనే హెర్బల్‌ ట్రీట్‌మెంట్‌విధానం :వెండిరేకుల పొడి రెండు చిటికెలు, స్వర్ణభస్మం ఒకటినుండి రెండు చిటికెలు, వేపనూనె రెండు చెంచాలు ఉసిరిపొడి రెండు నుంచి నాలుగు చెంచాలు, మందారపువ్ఞ్వల ముద్ద చెంచాడు, నిమ్మ,నారింజ, ఎండుచెక్కలపొడి చెంచా గ్లిసరిన్‌, గ్రుడ్డు తెల్లసొన, కప్పు పుల్లటి పెరుగులో కలిపి శుభ్రమైన పొడిజుట్టుకు స్కాల్స్‌కు అంటేటట్టుగా వేళ్లతోగాని, బ్రష్‌తోగాని క్రాప్‌లేకుండా పూసి మిగతా భాగాన్ని జుట్టుకు పాయలుచేసి రాయాలి. రెండుగంటల వ్యవధి, తరువాత స్నానము చేయాలి. విధానం 2: కరక్కాయపొడి, బచ్చలిఆకు, వట్టివేళ్లు, మందారచెక్కు, ఆక్రూట్‌ పప్పుకు, ఆల్‌మండ్‌ ఆయిల్‌ కలిపి ముద్దగానూరి జుట్టు అంతా పట్టించి ఒకటిన్నర గంట తర్వాత స్వచ్ఛమైన శీకాయతో జుట్టును శుభ్రంచేయాలి. అన్నిటికన్నా విటమిన్‌లు, ప్రోటీ న్‌ల ఆహారం తీసుకోవాలి.