ఆత్మ విశ్వాసంతో పనిపై దృష్టి

జీవన వికాసం

ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఆందోళన, కుంగుబాటు ఎక్కువ మందిని బాధిస్తున్నాయి. ఇది యువతలో మరీ ఎక్కువ. చాలా మంది తమలోని ఆందోళనను గుర్తించగలుగుతున్నా, కుటుంబాటు గురించి మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. మరి దీన్ని గుర్తించాలంటే. నీ జీవితం ఎందుకిలా అని నిరాశతో ఎక్కువ ఆలోచిస్తారు. రాత్రి ఎప్పుడోగాని నిద్రపట్టదు. ఉదయం లేవాలనిపించదు. ఏ పనైనా సరే చిటికెలో పూర్తి చేసే వీరు ఏ పనీ చేయడానికి ఇష్టపడరు. పని మొదలు పెట్టడానికే భయపడతారు.

ఇన్ని రోజులు అందరినీ పలకరించి కలివిడిగా గడినిప వారే ఇప్పుడు ఎవరైనా పలకరిస్తే విసుక్కుంటారు. అసహనం, కోపం పెరిగిపోతాయి. ఎంత కష్టపడి చదివినా రేపు పరీక్ష బాగా రాయలేనేమోనన్న దిగులు వీళ్లని వెంటాడుతుంది. నేను పనీ బాగా చేయలేనేమో అని కలత చెందుతారు. పుస్తకం ముందర ఉన్నా మనసంతా ఎక్కడో ఉంటుంది. ఏ పనిపైన శ్రద్ధ పెట్టలేరు. అయితే ఇలా చేయడం మంచిది. ప్రాధాన్యాన్ని బట్టి పనులను విభజించుకోవాలి. కష్టమైన పనులనే ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నిం చాలి.

ఇది ధైర్యాన్నిస్తుంది. క్రమంగా ఆత్వవిశ్వాసంతో మరో పని మీద దృష్టి పెడతారు. సంతృప్తి ప్రతికూలతను దూరం చేస్తుంది. ఏ పనిచేసినా అనుభూతి చెందుతూ, ఆస్వాదిస్తూ చేయడం మరిచిపోవద్దు. మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోండి. పుస్తకాలు చదివితే విభిన్నంగా ఆలోచించడం, జ్ఞాపకశక్తి పెరగడం వంటి ఎన్నో లాభాలుంటాయి. వాట్సాప్‌, ఎఫ్‌బీలో ఫ్రెండ్స్‌ స్టేటస్‌లు, మెసేజ్‌లు చూసే కొద్దీ అన్ని ఇలాంటివే ఉంటాయి. వాటి నుంచి బయటకు రాలేరు. అందుకే రోజులో కొంత సమయం మాత్రమే ఫోన్‌ కోసం కేటాయించాలి. కొందరికి డాన్స్‌ చేస్తే కిక్కొస్తుంది. మరికొందరు ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌ చేస్తే సంతోషంగా ఉంటారు. ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన అభిరుచులను చేయడానికి ప్రయ త్నించండి. వీటితో ఎక్కువ సేపు గడిపారనుకోండి మీలోని ప్రతికూల ఆలోచ నలన్నీ తొలగిపోతాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/