ఆత్మజ్ఞానోదయం

om
om

ఆధ్యాత్మ సాధన మానవ జీవితాలకు సుఖశాంతులను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మ భావన దైవభావనయే. ఈ భావన స్థిరపడాలంటే సాధన ముఖ్యం. ఈ సాధన ప్రారంభానికి పలు విషయాలను సాధకులు తెలుసుకుని మసలాలి. లేకపోతే చెడు మార్గంలో పడిపోతారు. ఈ సాధనను పెద్దలైన మహనీయుల వలన అనుభవజ్ఞులైన గురువ్ఞల వలన ముఖ్యపద్ధతులను తెలుసుకోవాలి.
ఆధ్యాత్మిక సాధనకు ఇంద్రియ నిగ్రహం ఎంతో ఆవశ్యకమైనది. ఈ సూత్రాన్ని గమనించి మసలుకోవాలి. దీనిలోతుపాతులను తెలిసికొనలేకపోతే ఇంద్రియాలను అణచి లోపలి మనస్సుతో లోక వ్యవహారాలను, విషయభోగాలను చేయుచుండుట జరుగుతుంది. ఈ విషయాన్నే భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునునికి కర్మయోగంలో ఆరవశ్లోకం లో ఇలా తెలిపారు.
శ్లోII కర్మేంద్రియాణి సంయమ్య-య ఆస్తే మన సా స్మరన్‌ ఇంద్రియార్థాన్‌ విమూఢాత్మా- మిథ్యాచా రస్య ఉచ్చతేII అనగా ఎవడు కర్మేంద్రియాలు-జ్ఞానేంద్రియాలను అణచి మనస్సు చేత ఇంద్రియాల శబ్దాది విషయాలను ఆలోచిస్తూ ఉంటాడో అట్టివాడు మూఢచి త్తుడుగా ఉంటాడు.
కపటమైన ఆచరణ గలవాడనీ తెలిపారు. సాధకులు ఈ డంబాలకు తావివ్వరాదు. ఇలాంటి డంబాలు చేసే వారిని మిథ్యాచారులంటారు. ఉత్తమ సం యమము గలవాడు మిథ్యాచారిగా వేరడు, ధ్యానమందును మనస్సును దైవముపై నిలుపక కొందరు సాధకులు పలుదారులలో పయనిస్తూ ఉంటారు. పరమార్థ-పరమాత్మ తత్త్వాన్ని మరచిపోతుంటారు.
ముముక్షువ్ఞలైన వారు తమ మనస్సులను విషయములపై పరుగెత్తిననూ, అదే ఆధ్మాత్మిక సాధన. కర్మలు మానరాదు. కర్మలు చేయకుంటే చిత్తశుద్ధి కల్గదు. జ్ఞానం అంకురించదు. జ్ఞానం లేకుంటే మోక్షం అనగా పరమపదం సిద్ధించదు. దేహయాత్ర సక్రమంగా కొనసాగదు. ఆధ్యాత్మ సాధకులు నియత కర్మలచే మనస్సును శుద్ధి పరచుకుంటే ఆత్మజ్ఞానోదయం కల్గుతుంది. సత్కర్మలు దైవార్పిత కర్మలుగా ఉంటే సాధకులకు ఎంతో మేలు శ్రేష్టము.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/