అసూయ ఒక మానసిక రుగ్మత

with jealousy
with jealousy

అసూయ ఒక మానసిక రుగ్మత

ఆత్మగౌరవం కోల్పోయినప్పుడో, భాగస్వామి మనస్సులో అభద్రతా భావం చెలరేగినప్పుడో అది జెలసీగా ప్రతిఫలిస్తుంది. చాలామంది విషయంలో జరిగేది ఇదే. ఉదాహరణకి మీరు మీ గురించి తక్కువగా భావించడం చేత మీరు ప్రేమించిన వ్యక్తో లేదా జీవిత భాగస్వామో మీతోనే ఉండాలనుకుంటారనేది మీరు నమ్మలేకపోవచ్చు. మరో విధంగా చూస్తే మీరు జీవిత భాగస్వామి గురించి ఘనంగా భావిస్తుండవచ్చు. అందువల్ల వారు ఎవరిని కోరుకుంటే వారికి దగ్గరవ్వగలరనే నమ్మకం మీకు కలుగవచ్చు. ఇలాంటి ఆలోచనలు మీకు కలిగినప్పుడు అవి జెలసీకి దారితీస్తాయి.

కొంతమేరకు జెలసీ సహజంగా కలిగే ఫీలింగ్‌ మీ అనుబంధాన్ని రక్షించుకోవాలని కోరుకోవడం వల్ల, మీరు కోరుకున్న వ్యక్తి మీకే సొంతమవ్వాలనుకోవడానికి స్వయం చులకనభావం తోడైతే కలిగేది. ఏదెలా ఉన్నా జీవితానుభవాలు ఎవరినైనా జెలసీకి గురిచేస్తాయి. ఒక్కోసారి మీరు జెలసీగా ప్రవర్తించడానికి మీ గతం కూడా ఓ కారణం కావచ్చు. మీరు గతంలో మోసపోయి ఉంటే-భాగస్వామి నాకే సొంతమన్న భావనను మరింతగా పెంచుకుంటారు. మళ్లీ మోసపోతామేమోనన్న భయంతో వారిని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. వారిపై మరింత నిఘాని వేస్తారు.

అదేవిధంగా మీరు జీవిత భాగస్వామి పట్ల గతంలో విశ్వసనీయంగా లేకపోయినా, ఇప్పుడదే విషయంలో జరుగుతుందేమోనని సందేహించి భయపడతారు. వారు మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తున్నట్లు ధృవీకరించుకోవాలనుకుంటారు. దీంతోపాటు మీకు, మీరు ప్రేమించిన వ్యక్తి అతికష్టం మీద లభించి ఉంటే వారు నాకు మాత్రమే కావాలనే పాజిటివ్‌ ఫీలింగ్స్‌ ఎక్కువగా కలిగే ఆస్కారముంది.

ఎందుకంటే వారిని దూరం చేసుకుంటానేమో అనే భయం ఉంటుంది కనుక. అందుకే అసూయను కలిగి ఉన్నవారు ఇన్‌సెక్యూరిటీగా ఉంటారు. వారిని వారే మోసం చేసుకుంటూ భాగస్వామిని కూడా మోసం చేస్తారు. అసూయ అనేది మనిషిలోని అనురాగాన్ని చంపేసి క్రూరత్వాన్ని మేలుకొలుపుతుంది. ఫలితంగా మనిషి జంతువ్ఞలా ప్రవర్తిస్తారు.

అమ్మాయిల మీద దాడిచేసే ప్రతీ అబ్బాయిలూ ఇందుకు ఉదాహరణలే. అసూయ పైకి కనిపించే దానికంటే లోలోపల చాలా ఎక్కువగా ఉండి అసూయను తినేస్తుంది. అసూయతో కూడిన ఫీలింగ్స్‌ కలగడం వెనుక భయం దాగి ఉంటుంది. దాన్ని తుంచివేయకపోతే మళ్లీమళ్లీ తన ఉనికిని చాటుతూనే ఉంటుంది. నిజమేమిటో తెలుసుకోండి. మీకు అసూయ ఎందుకు కలుగుతుందో ఆ కారణాల్ని పరీక్షించుకుని అవి ఎంతవరకూ సరైనవో ప్రశ్నించుకోండి. మీ అనుబంధం ప్రమాదంలో పడిందా? మీ ప్రవర్తన పరిస్థితిని మరింత ఘోరంగా మారుస్తోందా? అనే విషయాలను మీ ఆత్మీయుల్లో ఎవరో ఒకరి ద్వారా ఆ విషయాల గురించి చర్చించండి. ఇలా చేసినప్పుడు వారు కూడా నిష్పాక్షిక బుద్ధితో మీ భాగ స్వామిని గమనించగలిగిన వారై ఉండాలి. లేదా తీర్పు ఒకే వైపు ఉంటుంది. పెంచుకోవడం వల్ల మీరు మీ గురించి మెరుగ్గా ఫీలవ్ఞతారు. ఇందుకు ఏఏశక్తులు న్నాయో తెలుసుకోవాలి. మీ పట్ల మీరు దయగా ఉండాలి.