అజీర్ణం తగ్గించే సోంపు

indigetion1
indigetion1

అజీర్ణం తగ్గించే సోంపు

మనలో చాలామందికి తెలిసిన సుగంధ ద్రవ్యం సోంప్‌. హొటళ్లలో అల్పాహారం, భోజనం, కాఫీ, టీ మొదలైనవి సేవించిన తరువాత మన దృష్టి మరలేది సోంప్‌ మీదకే. కొంతమంది ఇళ్లలోనూ భోజనానంతరం సోంప్‌ను ఉపయోగిస్తుంటారు. సోంప్‌ ఔషధ గుణాలు చాలామందికి తెలియవు. ఇవి పరిమాణంలో జీలకర్ర కంటే కొంచెం పెద్దగా ఉండటం వలన స్థూలజీరకమనే పేరుతోపాటు, గింజలు తీపిదనాన్ని కలిగి ఉన్నందున మధురిక అనే పేరు కూడా వీటికి ఉంది. సౌమ్యంగా, సమర్థవంతంగా పని చేసే సోంప్‌తో అనేక ఆరోగ్య సమస్యలను మనం సులభమార్గాల ద్వారా ఎదుర్కొనవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.సోంప్‌గింజల చూర్ణం ఒక భాగం, అతి మధురం చూర్ణం రెండు భాగాలు,
పటికబెల్లం పొడి మూడు భాగాల వంతున కలిపి ఉంచుకుని ప్రతిరోజూ రెండు పూటలా ఒక స్పూన్‌ చొప్పున నీటితో దగ్గు, ఆయాసం, జలుబు తగ్గుతాయి. వేసవికాలంలో ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ప్రయోజనకారి. ఈ ఔషధ సమ్మేళనం ధూమపానం చేసే వారిలో వచ్చే దగ్గుకు సత్వర ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా సోంప్‌ వాడటం వలన ఉబ్బస వ్యాధి నియంత్రణలో ఉంటుంది.నేతితో వేయించిన సోంప్‌ను చూర్ణం చేసి, సమభాగం పంచదార కలిపి ఉంచుకుని రోజూ ఉదయం, సాయంత్రం ఒక స్పూను ప్రమాణంలో నీరు అనుపానంగా తీసుకుంటే అతి వేడి వలన కలిగే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సాఫీగా వెలువడుతుంది. సిద్ధ వైద్య విధానంలో ప్రాచుర్యం పొందిన కణాత్‌తైలం అనే ఔషధ తయారీలో ఆముదం, కలబంద, అక్కలకర్ర, కుంకుమపువ్వు వంటి ఔషధాలతోపాటు సోంప్‌ను కూడా ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు. ఈ తైలాన్ని అతి వేడి వలన చర్మం ఎండిపోయినట్లు ఉండటం, వాంతులు, చిన్న పిల్లల ఊపిరితి త్తుల వ్యాధుల్లో అభ్యంతర సేవనకు ఉపయోగిస్తారు. యునాని వైద్య విధానంలో కూడా జీర్ణాశయ రుగ్మతలకు వాడే ఔషధాలైన అర్క-యి-బడి యాన్‌, ఇత్రి ఫల్‌-యి- ములాయిన్‌ తయారీలో సోంప్‌ను ఉపయోగిస్తారు. అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, పులిత్రేన్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.