అంతా రామమయం

LORD RAMA2

అంతా రామమయం

ఏక శ్లోకి రా మాయణ ము ఆదౌరామ తపోవనా దిగమనం- హత్వా మ గంకాంచనం వైదేహీహరణం- జటాయు మరణం-సుగ్రీవ సంభాషణం వాలినీగ్రహణం-సముద్ర తరణం-లంకాపురీదహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం యేతద్ది రామాయణమ్‌I అంతా రామమయం – ఈజగమంతా రామమయం. ‘రామస్య అయనం రామాయణం. రామనామములో ర,అ,మ అను మూడు అక్షరములున్నవి. ర-అగ్ని బీజము-పాపాలను దహించివేస్తుంది. అ-సూర్యబీజము-అజ్ఞానమనే చీకటిని దూరం చేస్తుంది. మ-చంద్రబీజము-తాపములను చల్లార్చుతుంది. ఒకానొక సమయంలో దేవతలు తమలో తాము కలహించుకుని ‘నేను గొప్ప, నేను గొప్ప అని వాదించుకుని, బ్రహ్మవద్దకెళ్లారుట. బ్రహ్మ మీలో ఎవరైతే ముందుగా భూప్రదక్షిణ చేసి నా వద్దకువస్తారో, వారు పూజార్హులు, గొప్పవారు అని చెప్పాడుట.