తెలుసుకో!: ఆకాశంలో ధృవ నక్షత్రం

Polar Star
Polar Star

విశాలవిశ్వంలో కదలకుండా నిశ్చలంగా ఉన్నది ఏదీ లేదు. కాబట్టి ధ్రువ నక్షత్రం కూడా కదులుతుంది. కదిలితే ఏమవ్ఞతుంది అనడం కన్నా కదలకపోతే ఏమవ్ఞతుంది అనే ప్రశ్నకు జవాబు ఏమిటంటే, ఈ తార కదలకుండా ఉండే ప్రసక్తే లేదు.
ఒకవేళ కదలకుండా ఉంటే ఆ నక్షత్ర రాశి (పాలపుంత)లో అటూ ఇటూ ఉన్న నక్షత్రాలు, తదితర ఖగోళ సంబంధ గ్రహాలూ, ఉపగ్రహాల గమనంలో తేడా వచ్చి అక్కడ ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే ప్రమాదం ఉండి ఉండేది.

ధ్రువ నక్షత్రం అన్ని ఇతర నక్షత్రాల్లాగే కదులుతుంది. కాబట్టి ఆ బ్రహ్మాండం బద్దలయ్యే ప్రమాదం ఉండకుండా ఉం డేది. ధ్రువ నక్ష త్రం అన్ని ఇతర నక్షత్రాల్లాగే కదులుతుంది. కాబట్టి ఆ బ్రహ్మాండం బద్దలయ్యే ప్రమాదమేం లేదు.

అయితే అది కదలదని అనిపిస్తుంది ఎందుకు? మనం రైల్లో వెళ్లేటప్పుడు గమనిస్తే దూరంగా ఉన్న కొండలు, చెట్లు మెల్లగా కదులుతున్నట్లు దగ్గరగా ఉన్నవి వేగంగా కదులు తున్నట్లు అని పిస్తుంది. కాని అవ కదలవ్ఞ. కదిలేది రైలు ఈ ధ్రువ నక్షత్రం ఆర్సామైనర్‌ అనే తేలికపాటి నక్షత్ర సముదాయంలో ఉంది. మన సౌర మండలానికి సుమారు 275 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది సూర్యుడి తర్వాత మనకు దగ్గరగా ఉన్న ఆల్ఫా సెంటారీ కన్నా చాలా ఎక్కువ దూరం కాబట్టి ఆ నక్షత్రం కదులుతున్నట్లు అనిపించదు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/