కాస్త కునుకు.. ఒత్తిడి దూరం

Relief from Stress

ఆఫీసుల్లో మధ్యాహ్నం నిద్రపోవడమేమిటి అది బద్ధకస్తులు చేసేపని అన్నది ఒకప్పటి మాట. కాస్త కునుకు తీస్తే ఒత్తిడి తగ్గి పనితీరు మరింత మెరు గుపడుతుందనేది నేటి మాట. విదేశాల్లో ప్రముఖ సంస్థలు ఇదే విధానం పాటిస్తున్నాయి. అమెరికా, జర్మనీ ఇతర అభివృద్ధి చెందిన దేశా ల్లో మధ్యాహ్నం వేళ కాసేపు కునుకు తీసేందు కు ప్రైవేటు సంస్థలు కొన్ని సౌకర్యాలు కలిగిస్తు న్నాయి. కొంతసేపు విశ్రమించేందుకు అనుగుణం గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. వీటినే కకూన్స్‌ లేదా నాప్‌ పాడ్‌గా వ్యవహరిస్తారు. ఇరవై, ముప్ఫై నిమిషాల పాటు వీటిని విని యోగిం చుకుంటే 15 డాలర్ల వరకు వసూలు చేస్తున్నారు. వీటిని ఎక్కువగా ఐటీ కంపెనీలు, ఇతర బహుళ జాతి సంస్థలు ఉపయోగిస్తున్నాయి. ఆ సంస్థలు ఉన్న చోట నాప్‌ పాడ్‌లకు డిమాండ్‌ బాగా ఉంది. గూగుల్‌, నైక్‌ వంటి సంస్థలు తమ కంపెనీల్లోనే 20, 30 నిమిషాల పాటు నిద్ర పోయేందుకు ఉద్యోగుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. అలానే కాక్‌ పిట్‌ సిబ్బం దిపై నాసా చేసిన అధ్య యనంలో నిరంతరం పనిచేసేవారికి కాస్త కునుకు తీసేందుకు అవ కాశం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నా యని తేలింది. 26 నిమిషాల విశ్రాంతి కల్పిం చడంతో పైలట్ల లో 34 శాతం పనితీరుతో పాటు 54 శాతం అప్రమత్తత పెరిగి నట్లు గుర్తిం చింది. ఒత్తిడి తగ్గి మనసుకు దుట పడడంతో పాటు అప్పటి వరకు నిస్తేజంగా ఉన్న హార్మోన్ల లో ఒక్కసారిగా మార్పు వచ్చి మెదడు, శరీరం ఉత్తేజ మవ్ఞ తాయని వైద్యులు తెలిపారు.ఇది ఆయా సంస్థలకు పరోక్షంగా
ఎంతో మేలు చేస్తుంది. ఎవరికైనా
భోజనం తరువాత ముప్ఫై నిమిషాల పాటు రెప్పలు వాలిస్తే పూర్తిస్థాయిలో ఒత్తిడి దూరమవ్ఞతుంది. ముందురోజు నిద్రకు భంగం ఉంటే అది కూడా తీరిపోతుంది. ఉత్సా హంగా కనిపిస్తారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/