హిందీ, ఇంగ్లీష్‌ నేర్పించే యాప్‌

apps
apps

పిల్లలకు హిందీ లేదా ఇంగ్లీష్‌ నేర్పించాలనుకునేవారికి గూగుల్‌ కొత్తగా రిలీజ్‌ చేసిన ‘బోలో యాప్‌ ఉపయోగపడుతుంది. స్పీచ్‌ రికగ్నిషన్‌, టెక్ట్స్‌ టు స్పీచ్‌ టెక్నాలజీ సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించిన యాప్‌ ఇది. ఈ యాప్‌లో యానిమేటెడ్‌ క్యారెక్టర్‌ ‘దియా పిల్లలకు హిందీ, ఇంగ్లీష్‌ నేర్పిస్తుంది. కథలు చెబుతుంది. మాటలు నేర్పిస్తుంది. గూగుల్‌ బోలో యాప్‌లో 50 హిందీకథలు, 40 ఇంగ్లీష్‌ కథలున్నాయి. వీటితో పాటు వర్డ్‌ గేమ్స్‌, యాప్‌ రివార్డ్స్‌ వినోదాన్ని పంచుతాయి. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోయినా ఈ యాప్‌ పనిచేస్తుంది.