తెలుసుకోండి .. ఎన్నో ప్రయోజనాల అరటి

BANANA
BANANA


పిల్లలూ! సాధారణంగా మనం అరటి పండ్లు కాసేదాన్ని అరటి చెట్టు అంటాం. కాని అది అరటి చెట్టు కాదు. ఓ రకంగా మొక్క. ఎందుకంటే అందులో కలప ఉండదు. మరో విషయమేమంటే దీనికి ప్రత్యేకంగా కాండం ఉండదు. ఆకుల భాగాలే పొరలుపొరలుగా కలిసిపోయి కాండంగా మారతాయి. అరటి శాస్త్రీయ నామం మూసా ఆక్యునిమిటా. అరటి పండ్లను సంస్కృతంలో రంభాఫలం. కదలీఫలం అని హిందీలో ఖేలా, ఇంగ్లీష్‌లో బనానా అంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీటిలో చాలా రకాలున్నాయి. ప్రధానంగా కూర అరటి. పండు అరటి రకాలు దొరుకుతాయి. ఇవి ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లలో పెరుగుతాయి. పక్వానికి రాగానే కాయల్ని వేరుచేసి మాగబెడతారు. ఎందుకంటే ఒకవేళ గెలలను కోయకుండా అలాగే ఉంచినా.. పండటానికి చాలా ఆలస్యమవుతుంది. తొక్క రంగూ బాగుండదు. పండు కూడా రుచిగా ఉండదు. అరటి పండు తింటే వెంటనే శక్తి వస్తుంది. ఈ పండులో కెలోరీలు ఎక్కువ అంటారు. కాని చాలా తక్కువే. సీజల్‌ అంటూ లేకుండా సంవత్సరం పొడవునా దొరికే ఏకైక పండు అరటి.
దీని కాయలు, ఆకులు, పువ్వులు, లేతకాండాన్ని సైతం కూరల్లో వాడతారు. అరటి ఆకులు పచ్చగా, ఆకుపచ్చగా ఉండి ఎంతో అందంగా ఉంటాయి.
భోజనానికి అరటి ఆకు ఎంతో శ్రేష్టం.
దీని కాండాన్ని ఉపయోగించి పర్యావరణానికి హాని చేయని ప్లేట్లు తయారు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/