నీతి కథ : కరోనా వైరస్‌

అవగాహన కథ

Corona Virus
Corona Virus

ఆఫీసు నుండి అప్పుడే వచ్చి సోఫాలో కూర్చున్నాడు శ్యామ్‌. వెళ్లి తినడానికి ఫ్రెష్‌ అయి రండి అంటూ లోపల నుండి బయటకు వచ్చింది రమ్య. బడలిక వల్ల కాబోలు చేతులు కడుక్కుని తొందరగా రాబోయారు శ్యామ్‌. వెనుకనే ఉన్న లోకేష్‌ ‘ఏంటి నాన్న వాష్‌ బాగా చేసుకో అంటూ పక్కనే లోషన్‌ బాటిల్‌ చేతికి ఇచ్చాడు అదేంటి రా రోజు నేను నీకు చెప్పే వాడిని నువ్వు. ఈ రోజు నాకు చెబుతున్నావ్ఞ. నాన్న ఈ రోజు మా స్కూల్లో కరోనా వైరస్‌ గురించి చెప్పారు.

కానీ నాన్న నువ్ఞ్వ దాని గురించి ఇంకొక్కసారి చెప్పవా, అమ్మ నేను వింటాం అంటూ నాన్నతో పాటూ డైనింగ్‌ టేబుల్‌పై కూర్చున్నాడు. కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌ సముద్ర ప్రాంతంలోని ఆహారం ద్వారా వ్యాపించిందని అంటున్నారు. కరోనావైరస్‌ లాటిన్‌ పదం కరోనా అంటే కిరీటం అని అర్థం.

ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కనిపించడంతో ఈ పేరు పెట్టారు. కట్లపాము, నాగుపాము ఈ రెండు కూడా విషపరితమైన సర్పాలు. ఇవి ఎక్కువగా చైనాలో ఉంటాయి. ఈ విషపూరితమైన పాములు కరవడం వలన లేదంటే, వాటిని తినడం వల్ల వైరస్‌ సోకి ఉండవచ్చని అంటున్నారు. ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు,

ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారి తీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

చలికాలంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ‘నాన్న మరి దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు శుభ్రంగా డుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఇది అతి ప్రమాదకరమైనది కదా నాన్న అవ్ఞను కానీ జాగ్రత్తలు పాటిస్తే తప్పక నివారించవచ్చు.

  • సింగంపల్లి శేష సాయికుమార్‌, రాజంపేట

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/