సముద్రాలు

బాలగేయం

SEA

సముద్రాలు

సముద్రాలండీ సముద్రాలు!
ఉప్పు నీరిచ్చే సముద్రాలు
తుఫానులు తెచ్చే సముద్రాలు!
మూడు వంతుల భూమిని కబ్జా చేసేసిన సముద్రాలు
ముప్పొద్దులా కెరటాలతో ఎగిసిపడే సముద్రాలు
గిరగిరా భూమి తిరిగినా చుక్కనీరు ఒలకని సముద్రాలు
గర్భంలో రత్నాలు, ముత్యాలు దాచిపెట్టుకున్న సముద్రాలు
చంద్రుడి హెచ్చు తగ్గులతో
ఆటుపోటులొచ్చే సముద్రాలు
చల్లటి వర్షాలు కురిపించే
మబ్బుల్ని తెచ్చే సముద్రాలు
అగ్నిపర్వతాలు రగులుతున్నా
శాంతంగా ఉండే సముద్రాలు
ఐస్‌బర్గర్లు గడ్డకటిస్తున్నా నిబ్బరంగా ఉండే సముద్రాలు!

– కందేపి రాణీప్రసాద్‌