శునకాలు చిరునవ్వును పసిగడతాయి!

తెలుసుకో
                 శునకాలు చిరునవ్వును పసిగడతాయి!

DOG
DOG

భావోద్వేగాలను గుర్తించి వాటికి అనుగుణంగా మసలుకునే శక్తి మనుషులకే ఉందనుకుంటాం. కానీ శునకాలకు కూడాఈ శక్తి ఉందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. జపాన్‌లోని అజాబు యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు శునకాల్లోని రసజ్ఞానాన్ని గుర్తించాయి. ప్రత్యేకించి మనుషుల చిరునవ్ఞ్వలు గుర్తించడం, చిరునవ్ఞ్వల్ని చూసి అవి కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం వాటిలో కనిపించింది. ఏదైనా ఒక గ్రూప్‌ ఫొటో వాటి ముందు ఉంచినప్పుడు అందులో ఎవరైనా చిరునవ్ఞ్వతో కనిపిస్తే అవి వారికేసి తదేకంగా చూడటం మొదలెట్టాయి. ఆ తరువాత ముందుకు వంగి చిరునవ్ఞ్వతో కనిపించే వారి ముఖం మీద ముక్కను ఆన్చడం కనిపించింది. అదే నిర్లిప్తంగా ఉన్న ముఖాలను అసలేమి పట్టించుకోకపోవడమూ కనిపించింది. ఏదో వేళకు ఇంత తిండి పెడితే చాలు, వాటికి అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు అనుకుంటాం గానీ, వాటి సంతోషం, తమ యజమానులు, సంతోషంగా ఉండటం మీద కూడా ఆధారపడి ఉంటుందనిఈ పరిశోధనలు చెబుతున్నాయి. మన ముఖాల్లో చిరునవ్ఞ్వ కనిపించినప్పుడు సన్నిహితంగానూ, కోపతాపాలతో ఉన్నప్పుడు కాస్త దూరంగానూ ఉండడం కూడా అవి చేస్తాయట! ఇవన్నీ తెలిశాక, కనీసం వాటికోసమైనా సంతోషంగా ఉండేందుకు మనం ప్రయత్నించాలి కదా మరి!