వైట్‌హౌస్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?

White House
White House

వైట్‌హౌస్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?

వైట్‌హౌస్‌ అమెరికా అధ్యక్షుడు నివసించే ప్రభుత్వ నివాసం. ఇది వాషింగ్టన్‌ డిసి నగరంలో ఉంది. ఐర్లండ్‌కు చెందిన జేమ్స్‌ హూబన్‌ అనే ఇంజనీర్‌ రూపకల్పనలో అక్టోబర్‌ 13, 1792న దీని నిర్మాణం ప్రారంభించి, 1800 సంవత్సరం నాటికి పూర్తి చేశారు. దీనిని గచ్చకాయ రంగు రాళ్లతో నిర్మించారు. అప్పటి నుండి ఇది అమెరికా రాష్ట్రపతి అధ్యక్షుని నివాసగృహం అయింది.

1814, ఆగస్టు 24న జరిగిన యుద్ధంలో బ్రిటిష్‌ సైన్యం ఈ భవంతిని తగులబెట్టింది. భవనంలో కొద్ది భాగం మాత్రమే మిగిలింది. హూబన్స్‌ పర్యవేక్షణలోనే మరల దీనిని 1817లో పునర్నిర్మించారు. పొగ మరకలు కనబడకుండా గోడలకు తెల్లరంగు వేశారు. అప్పటి నుండి దీనిని వైట్‌హౌస్‌ అని పిలవ సాగారు. 1902లో అప్పటికే అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌ వెల్ట్‌ వైట్‌హౌస్‌గా ఈ భవంతికి పేరును అధికారికంగా నామకరణం చేశాడు.