బాల గేయం

balageyam
balageyam


సిరిమల్లె పందిరి కిందంటా
సీతారాములు పెళ్లంటా
జగమంతకు కళ్యాణంబంటా
ముత్యాల తలంబ్రాలు బోసెద రంటా
కోదండ రాముని రూపంబంటా
కోటిసూర్యలు ప్రకాశమంటా
జానాకీ వదన పరోజమంటా
చంద్రకాంతిని మించిన దంటా
సుందర సీతారాములు జంటా
చూచుట కక్షులు జాలవవంటా