బాల గేయం

balageyam
balageyam


చిన్ని చిన్ని చీమలు
చిన్న చిన్న అడుగలతో
మొదలయ్యే నడకలు
నడివడికలు నేర్చినచో
పయనం పురోగమనం
చిన్ని చిన్ని చీమయినా
చక్కెర చక్కగ వెతికి
కష్టించే శ్రమజీవులు
అందరికి ఆదర్శ ప్రాణులు
చిన్ని చిన్ని పువ్వులయినా
విరబూసి పరిమళించును
పరిసరాలు సుశోభితీలైనా
ప్రభావితాలు పంచిపెట్టును
చిన్ని చిన్ని బాలలు
ఇంటింటికి వెలుగులు
ఇల వెన్నెల పూతలు
రేపు పాలించే నేతలు