బాల గేయం కోయిల పాట

balageyam
balageyam

బాల గేయం కోయిల పాట
గుబురులో దాగేవు కోయిలా
గొంతుత్తి పాడేవు కోయిలా
గొంతుకలుపగనేను కోయిలా
కొసరి నువుడవే కోయిలా
ఇంత తియ్యనిపాట కోయిలా
ఏ గురువు నేర్పేడె కోయిలా
సృతి తప్పకుండాను కోయిలా
సొంతపుగా పాడేవు కోయిలా
మధుమాసమంతాను కోయిలా
మాఇంటికి అదిథివే కోయిలా
మావిచిగురే విందు కోయిలా
కమ్మగా భుజియించి కోయిలా
గానాల తేల్చవే కోయిలా
మధురగానాల మముతేల్చు కోయిలా