పిల్లలకు సమతుల ఆహారమే మేలు

తెలుసుకో

పిల్లలకు సమతుల ఆహారమే మేలు

FOOD
FOOD

ప్రపంచంలో సుమారు 212 మిలియన్ల జనాభా ఆహారలోపం జన్యువ్యాధుల వల్ల బాధపడుతున్నారు. ప్రపంచంలోని పోష కాహార లోపం ఉన్న ముఖ్య దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ పోషకాహార లోపం, అవి పొందలేని స్థితి ఉండటం కొంతైతే పోషకాహార విలువలు తెలియకపోవడం మరో కారణం. ఖరీదైన పదార్థాలలోనే పోషకాహార విలువలుంటాయని అనుకొని సామాన్యులు రోజువారీ వస్తువ్ఞల్లో కూడా పోషక విలువలు ఉంటాయని గుర్తించక పోవడం మరో కారణం. సృష్టిలోని ప్రతి ద్రవ్యంలో, ఆకులో, కాయలో, గింజలో పోషక విలువలు ఉంటాయి.

తీరిక లేని యాంత్రిక జీవితంతో ఎదుగు తున్న పిల్లలు అప్పటి కప్పుడు లభించే ఆహారం కోసం పరుగులు తీస్తూ ఇంట్లో అమ్మ చేసే కమ్మని ఆహారం వదిలేస్తున్న కుసంస్కృతిలో మనం ఉండకూడదు. ఆరాట పడుతూ, చేసుకునే అవకాశం లేక బయట తినే టిఫిక్‌ కన్నా ఇంట్లో వండినవి తింటే ఉత్సాహం శక్తి కలుగు తాయి. మనిషిలోని జీవకణాలు శక్తికి కావలసిన ఆహార సారం అందకపోవడం లేదా జీవకణాల శక్తికి అంద బడుతున్న ఆహార సారం మధ్య ఉన్న వ్యత్యాసం పోష కాహార లోపంగా గుర్తించారు.

ఈ వ్యత్యాసం ఎదుగుతున్న పిల్లలో ప్రస్షుటమవ్ఞతోంది. కొందరు లావెక్కిపోతామని పాలు తాగడం మానేస్తారు. పాలు ఓజస్సును పెంచే ఆహారం మరి! ప్రపంచవ్యాప్తంగా 54శాతం శిశు మరణాలకు ఆహారం లోపంతో వచ్చే వ్యాధులే కారణమని పరిశోధనలో తేలింది. దీనినే పోషక శక్తికారక ఆహారలోపం అంటారు. ఇది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిలోనే కాదు. అన్నీ ఉన్నా అవగాహన లేని వారిలో సైతం ఉన్నది. పిల్లలు తినడం లేదని ఆలోచించే తల్లులు బయట పిల్లలు ఏం తింటు న్నారో గమనించాల్సి అవసరం ఉంది.

దీనికి తోడు బయట దొరికే పదార్థాలలో చుట్టూ ఉన్న అనా రోగ్య పరిసరాలు, సూక్ష్మజీవ్ఞల వల్ల ఆహారం కలుషితమైన కొత్త జీర్ణ సమస్యలను, పోషకాహార లోపా లను కలుగజేస్తోంది. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంచిని పంచే ఆహారాన్ని పద్ధతి ప్రకారం ఒక సమయాన్ని అను సరించి తీసు కోవాలి. అలా తీసు కోక పోతే అసలు తగ్గని, శుష్కించి పోవడం లాంటి వ్యాధులు రావ చ్చు. లేదా పిల్లలు పాలిపోవడం, బొద్దుగా తయారవడం కానీ జరగ వచ్చు. నేటి విద్యావ్యవస్థ కూడా ఆహారం కూడా సరిగా తిననీయని చదువ్ఞలు ప్రవేశ పెట్టింది. ప్రొటీన్లు, మినరల్స్‌ ఉన్న పప్పు, ఆకు కూరలు, విటమిన్లు ఉన్న కాయకూరలు జీర్ణానికి ఉపయుక్తమైన జీర్ణాశ యాన్ని సమతుల్య చేసే మజ్జిగ రుతువ్ఞలను అను సరించి ఉండే పళ్లు తీసుకుంటే శరీరంలోని జీవకణాలు శక్తిని పుంజు కొంటాయి.