పిడుగులు అంటే ఏమిటి?

తెలుసుకోండి..

పిడుగులు అంటే ఏమిటి?

Thunder
Thunder

భారీ వర్షాలు పడ్డప్పుడు ఉరుములు, మెరుపులు రావ డంతో పాటు పిడుగు లు కూడా పడుతుం టాయి. బాగా అల్లరి చేసే పిల్లలను అల్లరి పిడుగులు అంటుంటారు. అలాగే జరగరానిది ఏదైనా జరిగిన ప్పుడు పిడుగుపాటులా పరిణమించింది అంటుం టారు. ఇంతకీ పిడుగులు అంటే ఏమిటో, అవి ఎం దుకు పడతాయో తెలుసు కుందామా? రుతుపవనాల ప్రారం భంలో మేఘాల కదలిక ఎక్కువగా ఉండి, తరచూ ఉరుములు వినిపి స్తుంటాయి. మేఘాలు ఒక దానితో ఒకటి ఢీకొన్న ప్పుడు కలిగిన ఘర్షణ వల్ల విద్యుత్‌ పుడుతుంది. అలా విడుదలైన విద్యుత్‌ భూమి పైన ఖాళీ ప్రదేశాలలో లేదా ఎత్తయిన ప్రదేశాలపై ప్రసరిస్తుంది. దీనినే పిడుగు పడడం అంటారు. అంతేగాని పిడుగు అంటే ఆకాశం నుంచి నేల మీద పడే వస్తువ్ఞ కాదు. విద్యుత్‌ ప్రవాహమే! పిడుగు పాటుకు గురయిన వస్తువ్ఞలు, భవనాలు లేదా చెట్లను పరిశీలించి చూసి నట్లయితే అవి నిలువ్ఞగా మాడిపోయి ఉండటం కనిపిస్తుంది. విద్యుద్ఘాతానికి గురైన వ్యక్తులు కూడా అదే విధంగా నల్లగా మాడి పోతారు. మరో విషయం వర్షం పడే టప్పుడు సాధారణంగా చాలా మంది చెట్ల, కింద, ఎత్తైన ప్రదేశాల కింద తల దాచుకుంటూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే పిడుగు లు పడేది ఎత్తైన ప్రదేశాల మీదనే కాబట్టి! పిడుగు పాటును నివారించటానికి ఎత్తయిన భవ నాలపై లైటెనింగ్‌ కండక్టర్‌ని ఉంచు తారు. ఇది రాగి తీగ వంటిది. పిడుగును అంటే విద్యుత్తు రాశిని ఇది గ్రహించి, ఉత్తమ విద్యుద్వా హకమైన భూమిలోకి సురక్షితంగా ప్రవ హింప చేస్తుంది.