పాలు పోసి పెంచినా పాము గుణం మారునా?

నీతి కథ

NEETI KADHA1
NEETI KADHA

పాలు పోసి పెంచినా పాము గుణం మారునా?

పక్షలవనంలోని పక్షులన్నీ కలిసి పాములగుట్టకి వేట కెళ్ళాలి. పక్షుల సందడిచూసి పాములు చెట్లు చాటుకి, గుట్టల మాటుకి, పుట్టలలోనికి పారిపోయాయి. కానీ ‘సర్ప రాజా అనే ఒక పాముపిల్ల మాత్రం పక్షులకు భయపడ కుండా వ్ఞండి పక్షుల వాడావ్ఞడిని చూస్తూ వ్ఞండి పోయింది. ఈ పాము పిల్లను భయంకరంగా పొడిచి తినేస్తాను అంది ఒక గ్రద్ధ. దీన్ని చావ్ఞ ఎంత భయాన కంగా వ్ఞండాలంటే పక్షులను చూసి పాములు బెంబేలెత్తి పోవాలి అంది ఒక రాబంధు. వద్దు వద్దు ఇది అమాయక పాము లేదా చెవ్ఞడు, గుడ్డి పాము అయి ్డంటుంది. ఇలాంటి బలహీనురాలుని చంపడం అన్యాయం. దీన్ని మనతో తీసుకుపోయి దీన్ని పెంచు కుందాము ముచ్చటగా ఉంది అంది ఒక పావురం. ఆ పావురమంటే పక్షులన్నీం టికీ అభిమానం, గౌరవం అందుకే ఆ పావ్ఞరం మాట కాదన లేక ఆ పాము పిల్లను పక్షులవనంలోనే ఉంచుకొని పెంచుకోవాలనిద నిర్ణయానికి వచ్చాయి.

పాముని అల్లారు ముద్దుగా పక్షుల న్నీ పెంచుతుండేవి కొన్ని పక్షులు గుడ్లు పగల గొట్టి రసం త్రాగిస్తే కొన్ని పక్షులు చిన్న చిన్న ఎలుకల్ని, కప్పల్ని తెచ్చి పాముకి ఆహారంగా పెడుతుండేవి. పాముపిల్ల పెరిగి పెద్ద దయింది. పక్షులకు తెలియకుండా పక్షుల పిల్లలను తినడం చేస్తుేంది విషయం తెలుసుకొని కొన్ని పక్షులు పాముని చంపి వేయాలని పట్టు బట్టాయి. కొన్ని వనం నుండి తరిమి వేయాలని నిర్ణయిం చాయి. కొన్ని బెదిరించి మందలించాలి అని సలహా యిచ్చాయి.

పాముని చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన పావ్ఞరం మాత్రం పాముని వదులుకోడానికి అంగీకరించ లేదు. పాము మీదున్న అతి ప్రేమవల్ల దానికి పూర్తి స్వేచ్ఛను యివ్వడంతో పాము యిరుగు పొరుగు వనాలకు, అడవులకు వెళ్ళి రకరకాల పాములతో స్నేహంచేసి, పక్షుల మీద దాడి చేయడానికి కుట్రలు పన్నింది. అలా కొన్నాళ్లు గడిచిన తరువాత పక్షులన్నీ నిద్ర పోతున్న వేళ వందలాది పాములు పక్షుల మీద దాడి చేశాయి. ఆకస్మికంగా పాములదాడి జరగడంతో పక్షు లు మధ్య సమన్వయం లోపించి చెరో దిక్కుకు చెల్లా చెదురై పారిపోయాయి. పక్షులవనం పాముల వశమ య్యింది. ఆ వనంలోకి పక్షులు తిరిగి రాలేక పోయాయి. పక్షులపిల్లలకు, గుడ్లు పాముల వశమయ్యాయి. పక్షు లన్నీ పావ్ఞ రాన్ని నిందించాయి. పాముకి పాలు పోసి పెంచినా దాని దుర్గుణం మార్చుకోలేదు అని మరో సారి నిరూపితమ య్యిందని పక్షులు చింతించాయి.

– ఎం.వి.స్వామి