పవిత్రమైన అరటి

తెలుసుకో..

banana

banana

పవిత్రమైన అరటి

అరటి భారతదేశమంతటా పూజ లందుకునే మొక్కలలో అరటి ఒకటి. అన్ని శుభకార్యాలలో అరటికి పాత్ర ఉంటుంది. పూజా మండపానికి అరటి పిలకలను కడతారు. దేవ్ఞడికి నివేదన చేసేది అరటి పండ్లనే. అరటి సంపదకు, సంతానానికి ప్రతీక. అందుకే అరటి పిలకలను గుమ్మాలకు ఇరువైపులా కడ తారు. పెళ్లిపందిళ్లకు కడతారు. అరటిపళ్లను ప్రసా దంగా తీసుకుంటారు. ఇతర ప్రసా దాలను అరటి ఆకులో పెట్టి అందిస్తారు. వినాయకుడికి ప్రీతీ పాత్రమైన చెట్టు అరటి. ప్రతి నిద్యం పూజలో అరటి పండుని నివేదిస్తారు. ఏ పండుకూ దక్కని ఆ పవిత్రత అరటికి ఇవ్వడం వెనుక మన పెద్దల నిశిత పరిశీలన ఉంది.

మిగిలిన పండ్లు ఏవైనా జంతువ్ఞలు, మనుషుల ద్వారా వ్యాప్తిచెందిన మొక్క ద్వారా వస్తాయి. తిని పారేసిన విత్తనాలు, పక్షుల ద్వారా వచ్చిన విత్తనాలు మొక్కగా మారి పండ్లు ఇస్తాయి. అలాంటి వాటిని భగవంతునికి నివేదించడం కన్నా, స్వతంత్రంగా మొక్కగా ఎదిగి అరటి ఇచ్చే పండ్లు పవిత్రమైనవని వాటికి ఆ అర్హత కల్పించారు. ప్రతిరోజూ పూజలో పెట్టే పండ్లు అయినప్పటికీ మనదేశంలో కొన్ని ప్రత్యేక దినాలలో అరటి పండును లక్ష్మీదేవికి, మహావిష్ణువ్ఞకు నివేదిస్తారు. డిసెంబరు – జనవరి మధ్యకాలంలో అమావాస్య తరువాత వచ్చే పదకొండవ రోజున అరటి పండ్లు వారికి నివేదిస్తారు. కార్తీకమాసం ఆరవ రోజున సూర్య భగవానునికి అరటిపండు నివేదించడం మంచిదని చెపుతుంటారు.