పరిశ్రమలకు ప్రసిద్ధి అర్జెంటీనా

తెలుసుకో

ARGENTANA
ARGENTANA

పరిశ్రమలకు ప్రసిద్ధి అర్జెంటీనా

అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఏర్స్‌. ఇక్కడ కరెన్సీని పెసో అంటారు. ఈ దేశస్తులు ఎక్కువగా మాట్లాడేది స్పానిష్‌ భాష. వీరి మతం క్రైస్తవం. రాజధాని నగరంలో ఉండే అధ్యక్ష భవనాన్ని పింక్‌ హౌస్‌ అంటారు. నగరం చుట్టూ అనేక పరిశ్రమలు ఉంటాయి. రాజధాని నగరాన్ని బ్యూనస్‌ ఏర్స్‌ అని పిలుస్తారు. దీని అసలు పేరు ‘సియుడాడ్‌ డిలా సాంటిసిమా ట్రినిడాడి పోర్టోడి నుయెస్ట్రా సెనోరా లా వర్జిన్‌ మారెయా డిలోస్‌ బ్యూనస్‌ ఏర్స్‌. ఇంత పెద్ద పేరును పిలవలేరు కదా! అందుకే సంక్ష్తిప్తంగా బ్యూనస్‌ఏర్స్‌ అని అంటారు.

దక్షిణ అమెరికా ఖండంలో ఒక ప్రత్యేక తరహా జీవన విధానం కలిగిన దేశం అర్జెంటీనా. క్రీ.శ. 1713 వరకు అర్జెంటీనా దేశం పెరూ రాజధాని లీమా ఆధీనంలో, స్పెయిన్‌ రాజుల పరిపాలనలో ఉండేది. 1816లో అర్జెంటీనా స్వతంత్ర దేశమయింది. అర్జెంటీనా చుట్టూ చిలీ, బొలీవియా, పరాగ్వే, బ్రెజిల్‌, ఉరుగ్వే దేశాలు మరో వైపు అట్లాంటిక్‌ మహాసముద్రం ఉంటాయి.

ప్రపరచంలో విశాలమైన దేశాలలో అర్జెంటీనా ఎనిమిదవ స్థానంలో ఉంది. దక్షిణ అమెరికా ఖండంలో ఒక ప్రత్యేక తరహా జీవన విధానం కలిగిన దేశం అర్జెంటీనా.

14-15 శతాబ్దాలలో స్పెయిన్‌, ఇండియా దేశాల నుండి ప్రజలు వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడి పర్వత పాదాల దగ్గర వేలాది ఎకరాల్లో ద్రాక్ష, ఆలివ్‌ తోటలు ఉంటాయి. ఇది ద్రాక్ష సారాయి తయారీకి పుట్టిల్లు. ఈ దేశపు పశ్చిమ భాగమంతా పర్వతాల మయమే. ఆండిస్‌ పర్వత శ్రేణులు ఈ దేశంలోనే ఉన్నాయి. దేశం మధ్య భాగంలో ఉండే పంపా ప్రాంతం కౌబా§్‌ులకు ప్రసిద్ధి. వీరిని అక్కడ గౌచోలు అంటారు. ఈ ప్రాంతంలో ఎన్ని కిలోమీటర్ల దూరం

వెళ్లినా పచ్చని పచ్చిక బయళ్లు తప్ప మరొకటి కనిపించదు. ఇక్కడి ఇగ్వాజ్‌ జలపాతం ప్రపంచంలో ఉన్న అతి పెద్ద, అత్యంత ఆకర్షణీయ జలపాతాల్లో ఒకటి. ఈ జలపాతం నదిని ఎగువ, దిగువ నదిగా విభజిస్తుంది. ఈదేశంలో పరానా, ఉరుగ్వే, మెండోజా అనే పెద్ద నదులు సంవత్సరం పొడవ్ఞనా ప్రవహిస్తూనే ఉంటాయి.