పట్టాభిరాముడి పట్టాభిషేకం

బాల గేయం

SITA RAMA KALYANAM
పట్టాభిరాముడి పట్టాభిషేకం

పట్టాభిరాముడి పట్టాభిషేకం

సంగ్రామం నందు నిలిచి గెలిచిన రఘువీరుడు సంస్కారం అనుపేరుకు మారు పేరు శ్రీరాముడు గురిచూసి కొట్ట గమనం చేపట్టి సీతమ్మ కన్నీరు త్రుంచిన పరమాత్ముడు పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం చెడుతలపును త్రుంచి మంచిని గెలిపించి మంచున రిసిన మల్లెల మాగాణి అనిపించి గెలుపు అంచున నిలిచి ఓటమిని త్రుంచి అందరికి ఆనందం పంచి ఆదర్శంగా నిలిచి అందరి మన్ననలు పొందిన రఘు కులాన్వయదీపం పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం పితృవాక్యపరిపాలనగావించి మాతృభక్తినిపెంచి చైత్రమాసమున పునర్వసు నక్షత్రమున జన్మించి పుణ్యభూమి ధర్మభూమి కర్మభూమిని బ్రతికించి బంగారు కనుల లల సీతమ్మను పరిణియమాడిన జగత్‌ కళ్యాణ కారునికి పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం – తోటపద్మిని, రాజమండ్రి