నక్క తెలివి

నీతి కథ

నక్క తెలివి

NEETI KADHA
NEETI KADHA

”ఒక అడవిలో ఒక నక్క ఉండేది.అది ఆకలిగా ఉండటంతో అడవి మొత్తం తిరగ సాగింది. కానీ నక్కకి ఎక్కడ ఆహారం దొరకలేదు. అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చొని తన ఆకలి బాధ ఎలా తీర్చుకోవాలిలని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే నక్కకు దగ్గరిలో ఒక ఏనుగు చచ్చి పడి ఉంటుంది. నక్కకు చాల సంతోషం వేసి అక్కడికి వెళ్తుంది. తన పంటితో ఏనుగును కొరుకుతుంది. కాని! ఏనుగు చర్మం గట్టిగా మరియు మందంగా ఉండటంతో తినడానికి వీలు కుదరకా ఇబ్బంది పడుతున్న సమయంలో అటు వైపుగా ఒక సింహం రావటం గమనించి దానికి ఎదురుగా వెళ్లి ” స్వాగతం మృగరాజ ఇందాకే ఏనుగును పులి వేటాడి మీరు రావడం గమనించి పారిపోయింది. నీ కోసమే నేను కాపల కాస్తున్న ఈ ఏనుగును ఆహారంగా స్వీకరించండి అంటుంది.

సింహం లేదు నక్క నేను వేరొకరు వేటాడిన దానిని తినను అని చెప్పి వెళ్ళిపోతుంది. హమ్మయ్య సింహం బారి నుండి తప్పించుకున్న కాని నా ఆకలి తీరేది ఎలా అని ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది? అప్పుడే అటు వైపుగా ఒక పులి వస్తుంది. పులిని గమనించిన నక్క పులితో ఇటు రావద్దు ఎందుకంటే ఇప్పుడే ఈ ఏనుగును సింహరాజు వేటాడి స్నానం చేసి వస్తాను అని వెళ్లారు. నిన్ను చుస్తే చంపేస్తుందని చెప్ప గానే భమపడిన పులి అటు నుండి వెళ్ళిపోతుంది. మళ్ళి తప్పించుకున్న నక్క ఆకలి ఎక్కువగా ఉండటంతో ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉంది. కొద్ది దూరంలో ఒక చిరుత నిద్రిస్తూ ఉంటం గమనించి దాని దగ్గరకు వెళ్లి నాపేరు నక్క నేను సింహరాజు దగ్గర పనిచేస్తున్న ఇందాకే రాజుగారు స్థానానికి వెళ్లారు అని చెప్పి ఏమైంది ఎందుకు పడుకొని ఉన్నావు? భోజనం చేశావా! అని పలు కరిస్తుంది. చిరుత లేదు నక్క నాకు వేటాడే శక్తిలేదు కాని ఆకలిగా ఉంది. ఏమి చేయాలో తెలియక పడుకున్న. వెంటనే నక్క అయితే నీకు ఉపాయం చెప్తాను అలా చేస్తే నీకు ఆహారం దొరుకుతుంది అని చెప్తుంది. సరే చెప్పు అని చిరుత బదులు ఇస్తుంది. ఇందాకే సింహ రాజు ఒక ఏనుగును వేటాడి స్నానం చేయడా నికి వెళ్లారు. కాస్త దూరంలో ఏనుగు శరీరం ఉంది. నువ్ఞ్వ వచ్చి తిను అంటుంది. సింహానికి తెలిస్తే నన్ను చంపుతుంది కదా అని అడుగుతుంది చిరుత. ” ఏమి పర్వాలేదు సింహరాజు వస్తే నేను కేక వేస్తాను నువ్ఞ్వ పారిపో అంటుంది. సరే అని చిరుత వచ్చి తన పదునైనన పళ్ళతో ఏనుగు శరీరాన్ని కొరికి కాస్త తినగానే త్వరగా కొద్దిగా తీసుకోని వెళ్ళిపోలేదంటే సింహరాజు వస్తాడు అని చెప్తుంది. ”సరే అని చిరుత కాస్త మాంసం తీసుకోని వెళ్ళిపో తుంది. చిరుత వెళ్ళిన వెంటనే నక్క హాయిగా తన కడుపు నింపుకుంటుంది. నీతి : ఎంతటి సమస్య వచ్చిన మనము తెలివితో ఆలోచించి పరిష్కరించుకోవాలి.

– అఖిలాశ, బెంగుళూరు.