దేవుడు చేయలేనిది!

నీతికథ

Neeti kadha
Neeti kadha

దేవుడు చేయలేనిది!

యక్షపాలన్‌ యక్షపురానికి రాజు. అతడు గొప్ప దైవభక్తుడు. దైవకార్యాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తుండేవాడు. తమ రాజ్యంలో శ్రీరామనవమి, మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలను కన్నులపండగలా నిర్వహింస్తుడేవాడు. పురాతన ఆలయాల అభివృద్ధికి, నూతన ఆలయాల నిర్మాణానికి ఎంతో ధనాన్ని ఖర్చు పెడుతుండేవాడు. ప్రజలలో దైవభక్తి, పాపభీతి కలిగించడానికి కృషి చేస్తుండేవాడు. అయితే యక్షపాలన్‌ ఎంతటి దైవభక్తుడో అంతకు మించిన శత్రుభయంకరుడు కూడా చేత కత్తి ధరించి కదనరంగంలో కాలు పెడితే చాలు ఎంత గొప్ప వీరులైనా యక్షపాలన్‌ వీర ప్రతాపాలకు తలవంచవలసిందే. దాసోహమనవలసిందే.

యక్షపాలన్‌ ఎన్నో రాజ్యాలను జయించి యక్షపురంలో కలుపుకున్నాడు. ఎందరో యోధానుయోధులను మట్టి కరిపించి వారిని తన సామంతులుగ చేసుకున్నాడు. అయితే యక్షపాలన్‌ ఎన్ని విజయాలు సాధించినా అవి తను సాధించిన విజయాలుగా చెప్పుకునేవాడు కాదు. తనకు లభించిన విజయాలన్ని దేవ్ఞడి కరుణా కటాక్షాల వల్లనే లభించాయని కనుక తనకు లభించిన విజయాలన్నీ దేవ్ఞడివేనని అంటుండేవాడు. తను తన రాజ్యము కరువ్ఞ కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండటానికి కూడా దేవ్ఞడి కరుణ కటాక్షాలే కారణమని అంటుండేవాడు.

ఇదిలా ఉండగా ఒకసారి యక్షపాలన్‌ మహారాజుకి హఠాత్తుగా పెద్ద జబ్బు చేసింది. రాజవైద్యులు అహర్నిశలు శ్రమపడినా యక్షపాలన్‌ జబ్బుని నయం చేయలేకపోయారు. మహారాజుగారికి వచ్చిన జబ్బేమిటో ఎంత ప్రయత్నించినా తమకు అంతుపట్టడం లేదని ఇక తాము చేయగలిగింది ఏమీ లేదని భారం అంతా దేవ్ఞడిదేనని దైవభక్తుడైన తమ రాజుకు ఇదేమి అవస్థ అనుకున్నారు.

తమ రాజును కాపాడమని దేవ్ఞడిని ప్రార్ధించారు. యక్షపాలన్‌ క్షేమం కోరుతూ ప్రజలు ఆలయాలలో పూజలు, వ్రతాలు చేయించారు. ఇంకా అనేక రకాలుగా దేవుడికి కొలువసాగారు. కొంతకాలం గడిచిన తరువాత యక్షరాజన్‌ జబ్బు తీసేసినట్లుగ తగ్గిపోయింది. ఆయన పూర్తిగా కోలుకున్నాడు. ఇవి జరిగిన కొంతకాలానికి మహామంత్రి యక్షపాలన్‌ వద్దకు వచ్చి ప్రభు మీ దైవభక్తే మిమ్మల్ని కాపాడింది. మిమ్మల్ని మాకు దక్కించింది అన్నాడు. యక్షపాలన్‌ అవ్ఞనన్నట్లుగా తల ఊపుతు ఇది ఎలా సంభవించిందంటారు.

దీన్ని బట్టి మీకేం అర్ధమవ్ఞతోంది అని అడిగాడే. మహామంత్రి సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు. దేవ్ఞడు చేయలేనిది అంటు ఏమీ ఉండదని ఆయన తలచుకుంటె ఏమయినా చెయ్యగలడని.. లేకుంటే మృత్యువ్ఞ ముంగిటి దాకా వచ్చి కూడా నేను బతికి బట్టకట్టడమేంటి? ఇప్పుడిలా మీతో మాట్లాడగలగడమేంటి? అన్నాడు. మహారాజు మీరు దైవభక్తులు కనుక ఇలా అంటున్నారు. కాని దేవ్ఞడు చేయలేనిది కూడా ఒకటి ఉంటుంది. అంటూ ఏదో చెప్పబోతుండగా ప్రభూ! ప్రభూ! అంటూ వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు భటుడు.

ఏమయింది? ఎందుకిలా కంగరుపడుతున్నాడు? అడిగాడు యక్షపాలన్‌ భటుడి వైపు చూస్తు. మన ఆస్థాన పూజారి మరణించాడు ప్రభు చెప్పాడు భటుడు. ఏంటి రోగం అడిగాడు యక్షపాలన్‌. ఏ రోగం లేదు ప్రభు. మనిషి గుండ్రాయిలా ఉన్నాడు. నిన్న రాత్రి కూడా నాతో సంభాషించాడు. ఉదయం లేచేసరికి ఈ వార్త చెప్పాడు భటుడు తలవంచుకుని. చూసారా మహారాజా మీరు తీవ్ర అనారోగ్యంతో చాలా రోజులు బాధపడ్డారు. దాదాపు చావ్ఞ ముంగిటి దాకా వెళ్లారు. మేమంతా మీరు మరణిస్తారనే అనుకున్నాం. వైద్యులు కూడా మీరు మరణిస్తారనే చెప్పారు.

కాని మీరు బతికి బయటపడ్డారు. కాని పూజారిగారు మాత్రం.. దేవ్ఞడు చేయలేనిది ఇదే మహారాజా! ఆయుర్దాయం తీరిన మనిషిని బతికించలేకపోవటం.. మంత్రి వివరణతో దేవ్ఞడు చేయలేనిది కూడా ఉందని యక్షపాలన్‌కు అవగతమయింది.

– ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌