జెయింట్‌ వీల్‌ రూపకల్పన ఎలా జరిగింది?

తెలుసుకోండి ..
          జెయింట్‌ వీల్‌ రూపకల్పన ఎలా జరిగింది?

gaint wheel
gaint wheel

మొదటిసారిగా 1893లో చికాగోలో జెయింట్‌ వీల్‌ను నిర్మించారు. దీనిని జార్జి ఫెర్రస్‌ అనే వ్యక్తి నిర్మించడంతో దానిని ఫెర్రిస్‌ వీల్‌ అని పిలిచేవారు. అప్ప ట్లోనే ఇది 250 అడుగుల వ్యాసంతో ఉండేది. దానికి ఉండే 36 గదుల ద్వారా 2,160 మంది ఒకేసారి తిరగగలిగేవారు. దీని తర్వాత దానిని చెప్పుకోవాలంటే జపాన్‌లోని యొకహామా నగరంలోని చక్రం గురించి చెప్పాలి. 344 అడుగుల ఎత్తున ఉండే దీనిలో ఒక పెద్ద గడియారాన్ని కూడా ఇమిడ్చారు. దానిలో 480 మంది కూర్చుని తిరగవచ్చు.ప్రపంచంలోకెల్లా పెద్ద జెయింట్‌ వీల్‌ లండన్‌లో ఉంది. దీని పేరు లండన్‌ ఐ. థేమ్స్‌ నది ఒడ్డున నిర్మించిన ఈ జెయింట్‌ వీల్‌ 450 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని నిర్మించడానికి ఆరేళ్లు పట్టింది. దీని మొత్తం బరువ్ఞ 1475 టన్నులు. దీనిలో కుర్చీల స్థానంలో 32 గదులు (క్యాప్యూల్స్‌) ఉన్నాయి. ఒక్కో దానిలో 25 మంది కూర్చోవచ్చు.