చెలిమి

బాలగేయం

Lord Krishna
Lord Krishna

చెలిమి

చెలిమంటె మా కిష్టం స్నేహంగా కలిసుంటాం
కలిమిలేములందు
కలతలు లేకను మేము కలసి జీవిస్తాము
ఒకే బాటలో పయనిస్తాము
కృష్ణ కుచేలవలెను మైత్రి తోడ మెలిగెదం
మమత మీర ఉండెదం
మమకారమెంతో పెంచెదం
స్నేహసంపద పంచెదం లోకమంత ఒకటి చేసి
ఒకే మాటలో నడిపెదం
కూలి యజమాని నొకటి చేసి
పేద ధనికులను కలిపెదం
భావి భారత మేలుకోరి
భక్తి పాటపాడెదం
శక్తి కలిగి ఉండెదం
ముక్తి మీరగ ముదము తోడ

ముందుకు సాగిపోయెదం

– మిట్టపల్లి పరశురాములు, సిద్ధిపేట

===