గురువు దేవునితో సమానం!

తెలుసుకోండి ..
                         గురువు దేవునితో సమానం!

TEACHING
TEACHING

సుకుమారమైన పిల్లల మనసులు కల్లాకపటం ఎరుగని చిన్నారి మనసులు కలతచెందినట్లు ఈటెల్లాంటి పద జాలంతో దూషించితే ప్రయోజనం శూన్యం. తల్లి ఆలనా పాలనతో పెరిగే చిన్నారులు ఇప్పుడిప్పుడే కొత్త ప్రపం చాన్ని చూస్తూ అవగాహన చేసుకుంటున్న సమ యంలో చదువ్ఞ పట్ల శ్రద్ధ కాస్త జాప్యం జరిగినా తీవ్రంగా దండించ వలసిన పనిలేదు. సున్నితమనస్కులైన బాల లను శిక్షించే పద్ధతిలో కాక ఆప్యాయతా నురాగాలతో లాలిస్తే మనం చెప్పి నది తప్పక చేసి తీరుతారు. పిల్లలకు మొదటి గురువ్ఞ తల్లి. తల్లి ఒడిలోనే అమ్మ, అత్త దగ్గర నుంచి అ,ఆల వరకు నేర్చుకుంటారు. రమారమి పిల్లలు స్కూలు కు వెళ్లే సమయా నికి తల్లి దగ్గర చిన్న చిన్న పదాలు, అంకెల వరకు నేర్చుకుని సిద్ధం గా ఉంటారు. అటువంటి పిల్లలను పాఠశాలలో ఉపాధ్యాయులు కొంత స్నేహపూర్వకమైన చిరునవ్ఞ్వను జోడించి నేర్పుగా పాఠాలు చెప్పగలిగితే ఆ చిన్నారులు తమ నైపుణ్యతను చూపి ప్రతిభకు పునాది వేసుకుని ప్రగతిబాటలో పయ నించగలుగుతారు.

పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్ద వలసిన బాధ్యత తల్లిదండ్రులది మొదటి స్థానమయితే ఉపాధ్యాయులది రెండోస్థానం. తప్పుదారిన పట్టిన పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని మంచి మాటలతో, నేర్పుతో మార్చా లేగాని, శారీరకంగా గాయ పరిస్తే గాయపడిన ఆ చిన్నారులు తీవ్రపరిణామాను సృష్టించి జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ‘గురుదేవోభం, ఆచార్య దేవోభవం అన్నారు పెద్దలు. పిల్లల దృష్టిలో గురువ్ఞ దేవ్ఞనితో సమానం. ఆ భావన పిల్లల మనసు లో ఎల్ల ప్పుడూ నిలుపుకోవలసిన బాధ్యత ప్రతి ఉపా ధ్యాయుడి లో ఉండి తీరాలి. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్ది వారిని బంగారుబాటలో నడిపించిన ఉపాధ్యాయుడి జన్మధన్యమవ్ఞతుంది.