గార్ధభ సంగీతం

నీతి కథ
                                   గార్ధభ సంగీతం

DONKEY
DONKEY

ఒక ఊరిలో ఒక రజకుడి వద్ద ఒక గాడిద ఉండేది. అతడు మురికిబట్టలను ఆ గాడిద మీద వేసి చెరువ్ఞకు తీసుకువెళ్లేవాడు. ఉతికిన తర్వాత ఆరబెట్టి వాటిని మళ్లీ ఇంటికి తీసుకుపోయి బట్టలు వారికి ఇచ్చేసేవాడు. పొద్దపోయే సమయానికి గాడిద చాలా అలసిపోయేది. అప్పుడు ఆ యజమాని దానిని స్వేచ్ఛగా తిరగనిచ్చేవాడు. ఆ విధంగా రోజులు గడుస్తుండగా ఒకరోజు రాత్రి అది ఒక నక్కను కలుసుకుంది. ఆ నక్క గాడిదను చూసి భయభక్తులతో నమస్కారం మామయ్యగారూ అంది. ఆ ఒక్క మాటతో వాళ్లిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ గాడిద తనకు మేనల్లుడు దొరికాడని సంబరపడిపోయింది.

కొత్తగా దొరికిన మేనల్లుడు దానికి మొక్కజొన్న పొలం చూపించాడు. అప్పటి నుంచి అవి రెండూ ప్రతిరోజు రాత్రి మొక్కజొన్న పొలంలో పడి తిరిగేవి. ఆ రోజు పౌర్ణమి చంద్రుడు నిండుగా ఉన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. ప్రకృతి చాలా అందంగా కనబడుతోంది. ఆ సౌందర్యానికి గాడిద ముగ్ధురాలై పాట పాడటం ప్రారంభించింది. నక్క దాన్ని ఆపడానికి ప్రయత్నించి మామయ్యా! ఇంత రాత్రివేళ ఈ పొలంలో పాట పాడటం నీకూ నాకూ కూడా అంత మంచిది కాదు. ఆ రైతు నిద్రలేస్తాడు. వాడు గనక మనల్ని చూస్తే ఉతికేస్తాడు అంది. అంత చెప్పినా ఏ మాత్రం వినిపించుకోకుండా, గాడిద గొంతు సరిచేసుకుని నీకు సంగీతం గురించి ఏం తెలుసు? ఆ రైతు ఈ పాటల్ని విని నిద్ర లేవనీ.

కనీసం ఆ రైతు అయినా నా సంగీతం వింటాడు అంది. ఎంత చెప్పినా వినకపోయేసరికి నక్క ఈ రోజు నీ స్వరం కొద్దిగా నీరసంగా ఉన్నట్లుంది. నీకు ఒంట్లో బాగాలేదనుకుంటాను. మరో రోజు ఎప్పుడైనా నువ్ఞ్వ పాడవచ్చు అంది. కానీ గాడిద మామయ్య నక్క మాటలను లక్ష్యపెట్టక ఇంత అందమైన పౌర్ణమి రాత్రి మెరుస్తున్న చుక్కల్ని చూస్తున్నప్పుడు కాక నేనింకెప్పుడు పాడ గలను? అంటూ కళ్లు మూసుకుని తలపైకెత్తి ఒండ్రుపెట్టడం మొదలుపెట్టింది గాడిద. దీంతో లాభం లేదనుకుని నక్క మెల్లగా పొలం నుండి జారుకుంది.

తలపైకెత్తి ఓండ్రపెడుతున్న కర్ణకఠోరమైన గాడిద గొంతు చుట్టు పక్కల పొలాల్లోని రైతుల చెవిన పడింది. వారు హుటాహుటిన పొలం లోకి వచ్చి గాడిదను చితకబాది అక్కడి నుండి తరిమేశారు. ఇప్ప టికీ ఆ సంఘటన గురించిఆలోచించినప్పుడల్లా ఆ రైతులకు సంగీతం విని ఆనందించే రసహృదయం లేదు అని అనుకుం టుంది గాడిద. నక్క మాత్రం ఎంతైనా గాడిద గాడిదే. అప్పటికీ నేను ఓండ్ర పెట్టొద్దు అని మొత్తుకుంటూనే ఉన్నాననుకుంటుంది. సమయానికి సందర్భానికి తగినట్లు నడుచుకోవటం విజ్ఞుల లక్షణం.
– ఉలాపు బాలకేశవ్ఞలు, గిద్దలూరు