కిరీటమైన తలపాగా!

బాలగేయం

FARMER
FARMER

కిరీటమైన తలపాగా!

సేద్యం చేసే రైతన్నా స్వేదం చిందిస్తావన్నా పశువ్ఞల తోటీ స్నేహం చేసి పంటలు పండిస్తావన్నా పుట్టెడు కష్టంతో నీవ్ఞ పుట్లను పోగేస్తావన్నా చీడలు కలుపులతో నిత్యం పోరాడే యోధునివన్న పంట పొలాలకు రాజువ్ఞ కాగా కిరీటమైనది తలపాగా వడిగా తనపై అడుగులు వేయగ పుడమి తనువ్ఞ పులకించన్నా పెద్ద మనసుతో పెంచిన నినుగని పైరులు తలవంచేనన్నా కడుపులు నింపే దాతవ్ఞగా కలకాలము వర్ధిల్లాలన్నా.. అన్నము నందించే మా పెన్నిధి నీవేనని మొక్కేమన్నా

– గుమ్మన్నగారి బాలసరస్వతి, సిద్ధిపేట