నిషేధించినా… వదలని బిటి-3 పత్తిసాగు

COTTON SEEDS
COTTON SEEDS

నిషేధించినా… వదలని బిటి-3 పత్తిసాగు

హైదరాబాద్‌,: తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్‌ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 పత్తివిత్తనం ఉత్పత్తి అవుతు న్నట్లు నిర్థారణ అయ్యింది. రైతుల ముసుగులో కొన్ని కంపెనీలు రాష్ట్రంలోని గద్వాల తదితర ప్రాంతాల్లో బిటి-3 పత్తి విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనికి స్పందించిన కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అధికారులు, విత్తన ధృవీకరణ సంస్థల ప్రతినిధులు గత నెల 18వ తేదీన గద్వాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 300 పత్తి విత్తనాల శాంపిళ్లను సేకరించి ఢిల్లీలోని ల్యాబ్‌లో పరీక్షించగా అవి బిటి-3 విత్తనాలుగా గుర్తించారు. ఆవిత్తనాల సాగు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు నిర్థారించినట్లు సమా చారం.

గత నెలలోనే ఓ గోదాంలో పట్టుబడిన ఒక కంపెనీకి చెందిన ఐదు శాంపిళ్లలో మూడింటిలో బిటి-3 పత్తి విత్తనాలు ఉన్నట్లు కేంద్ర పరిశోధనా బృందం కనుగొంది. బిటి-3 విత్తనాల సాగు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. రైతులకు తెలియకుండానే వారిఖర్చులతో వారి పొలాల్లోనే ఈ విత్తనం మొలకెత్తటం, ఫలించటం జరిగింది. బీటీ-3 విత్తనాల ఫలనాణ్యతపై ప్రయోగం జరు గుతున్నా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధి కారవర్గాలు గుర్తించ లేకపోవడం పట్ల కేంద్రం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలియవ చ్చింది.

జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రూవల్‌ కమిటీ (జీఈఏసీ) అనుమతి లేకుండానే బీటీ-3 విత్తనా లను తెలంగాణలోప్రవేశపెట్టారు. కలుపు నివార ణకు క్యాన్సర్‌ కారకమైన గ్లైఫోసెట్‌ రసాయ నాన్నివాడుతున్నారు. యూరోపియన్‌, ఆస్ట్రే లియా తదితర దేశాలు ఈ రసాయనాన్ని నిషే ధించాయి. దేశంలో దీన్ని వినియోగించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో బిటి-3 విత్తనం సాగవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బిటి-3 పత్తి రైతులను ఆర్థికంగా, మానశికంగా కృంగదీసింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి సాగు కాగా, ఆదేసమయంలో దిగుబడి కూడా పెరుగుతుందని ప్రభుత్వం సైతం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. అయితే రైతుల ఆశలు, అధికారిక అంచనాలను తారుమారుచేస్తూ బీటీ-3పత్తి నట్టేటముంచింది. రైతుల కలలన్నీంటినీ కన్నీళ్లను చేసింది.